English | Telugu

Bigg Boss 8 : ఎలిమినేషన్ నుండి సోనియా సేఫ్.. ఫస్ట్ వీక్ మీరంతా ఫ్లాప్!

బిగ్‌బాస్ సీజన్ 8లో తొలి వీకెండ్ ఎపిసోడ్ ఏదో హీటుహీటుగా జరుగుతుందేమోనని ఆడియన్స్ అనుకున్నారు. ఎందుకంటే యష్మీ టీమ్ చేసిన హంగామా, చూపించిన సైకోయిజానికి నాగ్ ఏమైనా వార్నింగ్ ఇస్తారేమోనని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అలాంటిదేం జరగలేదు. శనివారం నాడు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం‌. (Bigg Boss 8 Telugu)

బిగ్ బాస్ మొదలై అప్పుడే మొదటి వారం పూర్తయ్యింది. ఇక హౌస్ లో ఉన్న పద్నాలుగు మందిలో ఆరుగురు నామినేషన్ లో ఉండగా.. శనివారం నాటి ఎపిసోడ్ లో సోనియా సేవ్ అయ్యింది. ఇంకా అయిదుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక శనివారం నాగార్జున టిప్ టాప్ గా రెడీ అయి వచ్చి.. శుక్రవారం ఏం జరిగిందో మొదట చూపించాడు. ఇక హౌస్ మేట్స్ అందరికి హాయ్ చెప్పేసి మొదలెట్టాడు. ఇక హౌస్ లో ఎవరెవరు ఏం చేశారు? ఎవరెలాంటి వారో మీకు మీరే చెప్పండి అని చెప్పగా... ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలని చెప్పారు. ఇక వారి ఒపీనియన్ తీసుకున్నాక ఈ వారం మీ ప్రొగ్రెస్ కార్డు అంటూ ఓ బోర్డ్ తీసుకొచ్చాడు నాగార్జున.

ఈ వారం ఆటలో ఎవరు ఫ్లాప్ అనేది మాత్రమో చెబుతానంటూ క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ముందుగా ప్రేరణ నువ్వు ఫ్లాప్.. ఎంట్రీలో నిన్ను చూసి సూపర్ హిట్ అనుకున్నా కానీ హౌస్‌లో స్పార్క్ లేదంటూ నాగార్జున అన్నాడు. తర్వాత సీత నువ్వు ఫ్లాప్.. నువ్వు చాలా స్ట్రాంగ్ అండ్ కేరింగ్ అని అన్నావ్ కానీ అవి హౌస్‌లో కనిపించడం లేదు.. సీత ఒకటే మిగిలింది కిరాక్ కనిపించడం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత బేబక్క, ఆదిత్య ఫ్లాప్ అంటూ నాగార్జున అన్నారు. చివరిగా విష్ణుప్రియ కూడా ఫ్లాప్.. అంటు చెప్పాడు. బిగ్‌బాస్ హౌస్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి మాత్రమే కాదు ఇది ఓ జీవితం.. కనుక అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకొని నడుచుకో.. నీకు హౌస్‌లో ఏమైనా చేసే కేపబులిటీ ఉంది.. వెయిట్ చేస్తున్నా.. అర్థం చేసుకో అంటు చెప్పాడు. అంటే నీ పర్ఫామెన్స్ చాలడం లేదని నాగార్జున అన్నాడు. అయితే యష్మీ చేసిన పనికి చాలా ఫైర్ అవుతాడని అనుకున్నారంతా కానీ అదేం జరగలేదు. మరి రేపటి ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి మరి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...