English | Telugu
బిగ్ బాస్ నాగ మణికంఠపై సంచలన వ్యాఖ్యలు చేసిన అఖిల్ సార్థక్!
Updated : Sep 6, 2024
బిగ్ బాస్ సీజన్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంతమంది మెచురిటి లేనివాళ్ళు కూడా ఉన్నారంటు కొంతమంది ఇప్పటికే తీవ్రంగా విమర్శిస్తున్నారు.. గతాన్ని చెప్పుకుంటూ సింపథీ గెయిన్ చేయాలని చూస్తున్నాడంటు నాగ మణికంఠపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అఖిల్ సార్థక్.
అఖిల్ సార్థక్ గురించి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్-4 లో తనదైన అటిట్యూడ్ తో ఫినాలే వరకు వెళ్ళి.. చివరికి రన్నర్ గా నిలిచాడు. ఇక తాజాగా జరిగిన బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్ పై అఖిల్ స్పందించాడు. నాగ మణికంఠ పై తన అభిప్రాయం చెప్పాడు. ఫస్ట్ డే మణికంఠని అందరు నామినేట్ చేయగా.. తనని నామినేట్ చేసిన వారిపై వీర లెవల్ లో ఫైర్ అయ్యారు. ఇది గేమ్ కావొచ్చు. కానీ, ఇది లైఫ్ .. నేనేంటో నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చా.. నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ రావిపూడి అనిల్ బీబీ హౌస్ నుంచి తీసుకెళ్తు నీకు నచ్చిన హీరో ఎవరంటే.. మనోడు నాకు నేనే హీరో అంటూ ఇచ్చిన సమాధానం వేరే లెవల్. ఆ తరువాత శివుడిపై పాట పాడి భావోద్వేగానికి లోనయ్యాడు. కానీ చివరిలో అనిల్ రావిపూడి అది ప్రాంక్ అని చెబుతారు. ప్రాంక్ సమయంలో నాగ మణికంఠ ఓవరాక్షన్ తో మనోడిపై ఓవర్ అటెన్షన్ వచ్చిందనే చెప్పాలి.
హౌస్ లో మణికంఠ ఆటతీరు చూసి సానుభూతి చూపాలో.. ట్రోల్ చేయాలో.. అర్థం కాక అటు నెటిజన్లు, బిబి లవర్స్ ఆశ్చర్యంలో ఉన్నారు. ఈ తరుణంలో నాగ మణికంఠ ఆటతీరుపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన అటెన్షన్ సీకర్, ఈ విషయం నేను అనడం లేదు. తానే నిన్నటి షోలో అటెన్షన్ అంటే చాలా ఇష్టమని అన్నారు. దానికోసం ఏదైనా చేస్తాడని పిస్తుంది. బిగ్ బాస్ లో మన గతం గురించి చెప్పడానికి మనకు సమయం ఇస్తారు. కానీ, మణికంఠ ఫస్ట్ డే నుండే సింపథీ కార్డు వాడుతున్నారు. మళ్లీ నిఖిల్ కు బ్రేన్ తో ఆడాలి చెబుతున్నారు. తాను మాత్రం సింపథీ ప్లే చేస్తున్నాడు. బిగ్ బాస్ అన్ని చూస్తున్నాడు. ఫూల్స్ కాదు. దయచేసి సింపథీని చూసి ఓట్లు వేయకండి అని అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.