English | Telugu
Biggboss 8 Telugu: ఏ టాస్క్ లో ఎవరు గెలిచారంటే!
Updated : Sep 6, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో నామినేషన్ ప్రక్రియ తర్వాత హౌస్ లో టాస్క్ లు మొదలయ్యాయి. ఇక మొత్తం కంటెస్టెంట్స్ ని మూడు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్.
నిఖిల్ , యష్మీ గౌడ, నైనిక ముగ్గురు చీఫ్ లని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. ముందుగా ప్రేరణ కోసం నిఖిల్, యష్మీ పోడీపడగా.. యష్మీ టీమ్‌కి వెళ్లింది ప్రేరణ. ఆ తర్వాత ఆదిత్య, సీతలను నైనిక తన టీమ్‌లోకి తీసుకుంది. ఇక మణికంఠ కోసం కేవలం నిఖిల్ మాత్రమే నిలబడ్డాడు. దీంతో తన టీమ్‌లోకి వెళ్లాడు. అయితే విష్ణుప్రియ కోసం ఎవరూ లేచి నిలబడకపోవడంతో చివరికి నైనిక తన టీమ్‌లోకి తీసుకుంది. అభయ్ కోసం యష్మీ,నిఖిల్ పోటీ పడగా యష్మీ టీమ్‌లోకి వెళ్లాడు అభయ్. పృథ్వీ కోసం కూడా నిఖిల్, యష్మీ పోటీ పడి యష్మీ టీమ్‌లోకి వెళ్లేందుకు ఇష్టపడ్డాడు పృథ్వీ. ఇక అంతా పూర్తయ్యాక నిఖిల్ టీమ్‌లో తక్కువ మెంబర్స్ ఉండటం.. యష్మీ, నైనిక టీమ్‌లో ఈక్వెల్‌గా ఉండటంతో ముందు యష్మీ-నైనిక టీమ్‌కి ఓ పోటీ పెడతామంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. ఆ తర్వాత నిఖిల్ దగ్గరికొచ్చి విష్ణు మాట్లాడింది. నేను మణికంఠ కంటే వీకా నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదంటూ నిఖిల్‌ని అడిగింది. నిన్ను ఎవరైనా సెలక్ట్ చేస్తారు కానీ మణికంఠను ఎవరు సెలక్ట్ చేయరని నాకు తెలుసు.. అందుకే వాడి కోసం నిల్చున్నానంటూ నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు టవల్స్ అన్నీ ఒకేలా ఉండటం.. తన టవల్ కూడా బ్లూ కలర్‌యే అవడంతో బై మిస్టేక్ ప్రేరణ టవల్ వాడేశాడు ఆదిత్య. దీంతో చూసుకోవాలి కదా అంటూ ప్రేరణ కాస్త గొడవ పెట్టింది. దీంతో బిగ్‌బాస్ కొత్త టవల్ పంపాడు. ఇంకోవైపు బాత్రూంలు నీటిగా ఉంచడం లేదంటూ సోనియా, యష్మీ, మణికంఠ సహా కొంతమంది మధ్య చిన్న గొడవ జరిగింది.
నైనిక-యష్మీ టీమ్‌లకి బిగ్ బాస్ 'బాల్ పట్టు గోల్ కొట్టు' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచిన టీమ్.. నిఖిల్ టీమ్ నుంచి ఒకరిని తమ టీమ్‌లోకి తీసుకోవచ్చంటూ మెలిక పెట్టాడు.ఇక ఈ గేమ్ రెండు రౌండ్లలో జరిగింది. ముందుగా నైనిక టీమ్ నుంచి ఒక్కరు కూడా మొదటి రౌండ్‌లో గోల్ కొట్టలేకపోయారు. యష్మీ టీమ్ నుంచి మాత్రం అభయ్ ఒక గోల్ కొట్టాడు. ఇక రెండో రౌండ్‌లో కూడా నైనిక టీమ్ గోల్ కొట్టలేకపోయింది. దీంతో రెండో రౌండ్ ఆడకుండానే యష్మీ టీమ్ విన్ అయిపోయింది. మరి నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.