English | Telugu

Guppedantha Manasu : మను తండ్రిని నేనే అని చెప్పేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1050 లో.. పేరెంట్స్, లెక్చరర్ మీటింగ్ లో వసుధార అందరి పేరెంట్స్ తో మాట్లాడుతుంది. ఒక్కొక్క స్టూడెంట్ కాలేజీకి రాకపోవడంపై గల కారణం అడిగి తెలుసుకుంటుంది. కాలేజీకీ వస్తే కలిగే లాభాల గురించి గొప్పగా చెప్తుంది.

ఆ తర్వాత ఒక స్టూడెంట్ పేరెంట్ ని.. మీ అబ్బాయి ఎందుకు కాలేజీకి రావడం లేదని మను అడుగుతాడు. ఒక తండ్రిగా మీరే కొడుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటూ తండ్రి గురించి మను గొప్పగా చెప్తుంటాడు. మరొకవైపు శైలేంద్ర మనిషి శైలేంద్ర సైగ చెయ్యగానే.. మీరు ఫాదర్ గురించి గొప్పగా చెప్తున్నారు సర్ మీ ఫాదర్ మిమ్మల్ని బాగా పెంచారా సర్? మీ ఫాదర్ పేరు ఏంటని ఒకతను అడుగగానే‌‌.. మను షాక్ అవుతాడు. కాసేపు సైలెంట్ గా ఉంటాడు. చెప్పండి సర్ మీ తండ్రి పేరు తెలియదా.. మీ తల్లికి కూడా తెలియదా అని అతను అడుగుతాడు. దాంతో మను ఆవేశపడుతుంటే అందరు కంట్రోల్ మను అని అంటారు. అంతలో ఒకావిడ కలుగుజేసుకొని తల్లి అనుపమ గారు, తండ్రి ఎవరో తెలియదని అంటుంది.. నిజంగానే తండ్రి ఎవరో తెలియదా అని అతను అనగానే... నాకు నిజంగానే తెలియదు అని మను అంటుంటాడు. అప్పుడే మహేంద్ర వచ్చి మనుకి తండ్రి ఉన్నాడని అనగానే అందరు షాక్ అవుతారు. మరి ఎవరో చెప్పండని వాళ్ళు అనగానే.. మను తండ్రి నేనే అని మహేంద్ర అంటాడు. దాంతో అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది ఇక వెళ్లొచ్చని మహేంద్ర అంటాడు. వసుధార అందరిని వెళ్ళమని చెప్తుంది.

ఆ తర్వాత అసలు నువ్వు అలా ఎందుకు చెప్పావ్? మను నీ కొడుకేంటి? నాకేం అర్థం కావడం లేదని మహేంద్రని ఫణీంద్ర అడుగుతాడు. చెప్పు సమాధానం చెప్పు అని దేవయాని అడుగుతుంది. నువ్వు చేసిన పనికి అందరు వెలెత్తి చూపిస్తారని మహేంద్రని దేవయాని నీలదీస్తుంది. మను నా కొడుకు.. అదొక్క సమాధానం తప్ప మహేంద్ర ఏం చెప్పడు. నువ్వు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదని ఫణీంద్ర అనేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.