English | Telugu

ఆ చిన్న మిస్టేక్ వల్ల ఏడుపొచ్చేసింది!

సెలబ్రిటీలు చేసే కొన్ని పనులు చిత్రంగా ఉంటాయి. అయితే వారు అవి చేయడానికి పడే శ్రమ, డెడికేషన్ చూస్తే హో ఇంత జరిగిందా అనిపిస్తుంది. అలాంటిదే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నేహా చౌదరికి ఎదురైంది. ఆ విషయాన్ని తన వ్లాగ్ లో చెప్తూ బాధపడింది. అదేంటో ఓ సారి చూసేద్దాం.

తాజాగా స్టార్ మా టీవీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో నీతోనే డ్యాన్స్ 2.0 మొదలైంది. ఇందులో నేహా చౌదరి, విశ్వ ఓ జోడీగా పర్ఫామెన్స్ ఇస్తున్నారు. అలాగే ఏక్ నాథ్-హారిక, బాలదిత్య-పూజామూర్తి, శుభశ్రీ రాయగురు-మానస్ నాగులపల్లి ఇంకా రెండు జోడీలు తమ పర్ఫామెన్స్ ని కొనసాగిస్తున్నారు. ఈ షోకి జడ్జులుగా సదా, తరుణ్ మాస్టర్, రాధ చేస్తుండగా యాంకర్ గా శ్రీముఖి చేస్తోంది. అయితే డ్యాన్స్ షోలో భాగంగా ఒక్కో జోడీ చేసే డ్యాన్స్ కోసం వాళ్ళు కొన్ని గంటలు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ గ్రాంఢ్ ఫినాలే రోజున పెళ్లి కూతురిగా అటెండ్ అయిన నేహా చౌదరి.. తన స్నేహితుడినే పెళ్ళి చేసుకొని యూకేకి వెళ్లిపోయింది. ఇక పెళ్ళి తర్వాత అక్కడ రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా ఉంటుంది. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ' ఇలాంటి కాన్సెప్ట్ లో డ్యాన్స్ చేస్తా అనుకోలేదు' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేసింది.

ఈ వ్లాగ్ లో తను విశ్వతో కలిసి చేసిన డ్యాన్స్ స్టెప్స్ ని చూపించింది. ఇక తను బాహుబలి సినిమాలోని శివగామి గెటప్ లో రెడీ అయ్యింది. ఇక నేహాని శివగామిగా రెడి చేసాక.‌ తనని తాను చూసుకొని.. నాకు శివగామిలా అనిపించట్లేదు. ఝాన్సీ రుద్రమదేవిగా అనిపిస్తుందని విశ్వతో చెప్పుకుంటూ నవ్వేసింది. ఇక శివగామి గెటప్ లో బానే చేశాను కానీ స్టేజ్ మీద డ్యాన్సర్స్ ఉన్నప్పుడు నేను కాస్త తడబడ్డాను. అలా తోటి జోడీలతో కాంపిటేషన్ అని అనుకున్నప్పుడు చిన్న మిస్టేక్ చేసినా పోటీలో వెనకబడిపోతాం. అప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ ఒక్క మిస్టేక్ చేసి ఉండకపోతే బాగుండేదని నేహా చౌదరి ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. మరి స్టార్ మా టీవీలో వస్తున్న 'నీతోనే డ్యాన్స్' షోని ఎంతమంది ఫాలో అవుతున్నారు. అందులో శివగామి గెటప్ లో నేహా చేసిన ఈ డ్యాన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.