English | Telugu

భూలోకంలో నాన్న, యమలోకంలో నానా బూతులు...


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ మొత్తం యమలోకం కాన్సెప్ట్ తో నిర్వహించారు. పాపాల చిట్టా రాసే చిత్రగుప్తుడిగా తాగుబోతు రమేష్ నటించారు. ఐతే చిత్రగుప్తుడు వేషాన్ని చూసి కూడా చిత్రుగుప్తుడు కాదు అనే డౌట్ వస్తోందంటూ ఆటో రామ్ ప్రసాద్ అనేసరికి "ఐతే నువ్వు చేసిన పాపాలను ఈ భవిష్య వాణి పుస్తకంలో ఉన్నాయి చూపించనా" అని తాగుబోతు రమేష్ బెదిరించేసరికి "వద్దొద్దు" అని కంగారు పడ్డారు రాంప్రసాద్.

ఆ భవిష్యవాణిని తర్వాత ఆటో రాంప్రసాద్ చూసి 'మనకు ఇంకా ఆయుష్షు ఉంది ఐనా సరే పైకి తీసుకొచ్చేసాడు" అని రామ్ ప్రసాద్ నూకరాజుతో చెప్పేసరికి "వీ వాంట్ పెద్దాయన" అంటూ యమధర్మ రాజును పిలవాలంటూ గట్టిగా అరిచాడు . "ఆయన రావడానికి రెండు గంటలు సమయం పడుతుంది" అని రమేష్ అనేసరికి "రెండు గంటలు వెయిటింగ్ అంటే మాకు బోర్ కొడుతోంది" అన్నాడు రాంప్రసాద్. వెంటనే మంత్రం వేసి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిచాడు రమేష్. ఇక రష్మీ, ఇంద్రజ యమలోకానికి వచ్చేసారు. ఆటో రాంప్రసాద్ ఇంద్రజను చూసి "మీకు ఇంకా ఆయుష్షు ఉంది. ఐనా కూడా ప్రాణం తీసేసి మిమ్మల్ని ఇలా యమలోకానికి తీసుకొచ్చింది ఇతనే" అని రమేష్ ని చూపించేసరికి "చూస్తే దున్నపోతులా ఉన్నావు, గాడిదలా వయసొచ్చింది, ఎద్దులా కనబడుతున్నావు" అని ఇంద్రజ రెచ్చిపోయి మరి రమేష్ ని తిట్టేసింది. ఇక రష్మీ "భూలోకంలో ఐతే నాన్న , యమలోకానికి వచ్చేసరికి నానా బూతులా" అంటూ షాకయ్యింది. "ప్రాణం పోయిన తర్వాత నాన్నెంటి, అమ్మేంటి రష్మీ" అని పాపం ఏడుస్తూ చెప్పింది ఇంద్రజ. ఫైనల్ ఓటు గురించి ఓటు విలువ, ఓటు వేయని వారి గురించి ఒక స్కిట్ లాంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ లో చేసి చూపించారు కొంతమంది ఆర్టిస్టులు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.