ఏపీ ఉద్యోగులకు ఊరట.. రెండు విడతల్లో మార్చినెల జీతం
ఏపీలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో మార్చినెల జీతాలు, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఉంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు తెలిపారు.