English | Telugu
ఇక సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు!
Updated : Mar 30, 2020
ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా పరీక్షల కిట్లను అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఇటీవల వెల్లడించింది. కచ్చితమైన ఫలితాలు ఇచ్చే ఈ కిట్లను చౌక ధరకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కిట్ ధర వెయ్యి రూపాయలలోపే ఉండేలా కిట్లు రూపొందించడానికి పరిశీలిస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా అన్నారు.