English | Telugu
ఏపీ ఉద్యోగులకు ఊరట.. రెండు విడతల్లో మార్చినెల జీతం
Updated : Mar 31, 2020
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని ప్రభుత్వశాఖల నుంచి వచ్చే ఆదాయనికి తీవ్రంగా గండిపడింది. నెలనెలా రావాల్సిన పన్నులతో పాటు మైనింగ్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఆదాయాలు కూడా నిలిచిపోయాయి. దీంతో వేల కోట్ల రూపాయల రాబడి పోయినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నుంచి తాజా వివరాలు తీసుకున్న ప్రభుత్వం రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రావడం లేదని తేల్చింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఉద్యోగుల వేతనాలు, జీతాలు, పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం తరహాలో కోతలు పెట్టకుండా రెండు విడతల్లో జీతాలు, వేతనాలు, పింఛన్లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉద్యోగసంఘాల తరఫున 100 కోట్ల నిధులను ప్రభుత్వానికి ఇచ్చిన ఉద్యోగులు.. రెండు విడతల జీతానికి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.