English | Telugu
ఏపీలో మరో 17 కరోనా కేసులు.. ఢిల్లీ వెళ్లిన వారు మొత్తం 711
Updated : Mar 31, 2020
ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిందని తేలడంతో.. వారితో సన్నిహితంగా మెలిగినవారు, వారితో కలిసి ప్రయాణించిన వారిలో ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిపై ఏపీ సర్కార్ పై దృష్టి పెట్టింది. రాష్ట్రం నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారి లెక్క తేల్చింది. ప్రార్థనలకు వెళ్లినవారు మొత్తం 711 మందిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరూ తమ దగ్గరలోని ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చెక్ చేయించుకోవాలని.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.