English | Telugu
స్టేడియంలో కూరగాయల మార్కెట్!
Updated : Mar 31, 2020
కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా, కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు తాజా కూరగాయల్ని పంపిస్తున్నారు.
ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఈ పరిస్థితుల నుండి బయటపడేందుక ప్రజల సహకారం సంపూర్ణంగా ఉండాలని ఆయన అన్నారు.