కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? అనారోగ్యంతో తల్లి అయిష్టతతో తనయుడు అధ్యక్ష పదవికి దూరం
భారత స్వాతంత్య్ర సమరంలో సుదీర్ఘపోరాటం, స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఘన చరిత్ర కాంగ్రెస్ సొంతం. దేశభక్తులంటే కాంగ్రెస్ కార్యకర్తలే అన్నంతగా ఆ పార్టీ భారతదేశం చరిత్ర మూలాల్లో నాటుకుపోయింది.