English | Telugu
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్..
Updated : Aug 24, 2020
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణ జిల్లా కోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఆయన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.
జూలై నెల 6వ తేదీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వైసీపీ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో సహకారం అందించారనే ఆరోపణతో కొల్లు రవీంద్రను పోలీసులు తూర్పుగోదావరి జిల్లా సీతాపురం వద్ద జూలై 3న అరెస్ట్ చేశారు. మోకా భాస్కరరావు మచిలీపట్నం 23వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండడమే కాకుండా మంత్రి పేర్ని నానికి అత్యంత సన్నిహితుడు అయిన విషయం తెలిసిందే.