సుప్రీం కోర్టులో అమరావతి కేసు మరో సారి వాయిదా..
ఆంధ్రప్రదేశ్లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ మరో సారి వాయిదా పడింది. పాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.