ఏపీలో కోటి మందికి తెలియకుండానే కరోనా వచ్చి పోయింది.. తేల్చిన లేటెస్ట్ సర్వే
ఏపీ ప్రస్తుత జనాభా 5 కోట్లకు పైగా ఉంది. ఐతే అధికారికంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. అయితే రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి, అంటే ఏకంగా కోటి మందికి కరోనా వైరస్ సోకి తగ్గిపోయిందని సీరో తాజా సర్వేలో తేలింది.