English | Telugu
భారత్ లో కరోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 92,071 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 1,136 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సమావేశాలకు హాజరవుతున్న సభ్యులు, సిబ్బంది అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇండియా చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనగా ఒక పక్క చైనా మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోందనే విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుండగా మరో పక్క కంటికి కనిపించకుండా డ్రాగన్ దేశం మరో కుట్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
చైనాలోని వూహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసందే. అయితే ఈ వైరస్ ల్యాబ్ లో పుట్టిందా లేక జంతువుల నుండి మనుషులకు సోకిందా అనే విషయం పై ఇప్పటికి క్లారిటీ రాలేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ఆత్మ బలిదానం చేసుకున్నారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆరేళ్ళు దాటాక కూడా బలిదానాలు చేసుకోవడం ఆవేదన కలిగిస్తోంది.
గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నం చేశారు. దీనికి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆమె ఆరోపించారు. దీంతో ఉన్నతాధికారులు ఎక్సయిజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ ను సస్పెండ్ చేశారు.
కరోనా మహమ్మారి కారణంగా సామాన్య జనం ఇప్పటికే సంపాదన లేక అల్లాడుతుంటే తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ పేద, సామాన్య మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది.
వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం వల్ల అవినీతి అంతమవుతుందని, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
Perhaps the most concerning development in the recent past in Andhra Pradesh is that the freedom of the Press has come under...
అధికారం మా చేతిలో ఉందంటూ నియంతృత్వ పోకడలకు పోయే ప్రభుత్వాలకు న్యాయ స్థానాల్లో భంగపాటు తప్పదని మరోసారి రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అభ్యంతరకర వార్త ప్రసారం చేసిందని ఆరోపిస్తూ...
సీఎం వైఎస్ జగన్ దగ్గర మార్కుల కోసం కొంత మంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అభ్యంతరకర వార్త ప్రసారం చేశారని ఆరోపిస్తూ తెలుగు వన్ సంస్థపై సీఐడీ అధికారులు అక్రమకేసు పెట్టగా..
2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఇటు తెలంగాణలో తన ఆస్తులను కాపాడుకోవడంతో పాటు తనపై పెట్టిన కేసుల నుండి తప్పించుకోవడానికి సీఎం జగన్ ను కలిసారని అప్పట్లో టాక్ నడిచింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీలో జరిగిన మార్పులు తెలంగాణ హస్తం పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులుగా సీనియర్లను కాదని తొలిసారి యువ నేతలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది హైకమాండ్.
మన దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి రోజు దాదాపుగా లక్ష పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరొనాను ఎదుర్కొనేందుకు దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' క్లినికల్ ట్రయల్స్ కీలక దశలో ఉన్నాయి.
సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతిచ్చే అవకాశం ఉంది. సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది.