English | Telugu
ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి
Updated : Sep 11, 2020
రామాంజనేయులు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి ఛైర్మన్ గా రామాంజనేయులు వ్యవహరించారు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ కాపు కార్పొరేషన్ తొలి చైర్మన్ గా కార్పొరేషన్ కు ఉత్తమ సేవలందించిన చలమలశెట్టి మరణం విచారకరం అన్నారు చంద్రబాబు. పార్టీకి, కాపుల పురోగతికి, సంక్షేమానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.