English | Telugu

Brahmamudi : ఇంట్లో కాళీగా భర్త.. ఆఫీస్ లో బిజీగా భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారకమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -549 లో.. అనామిక మనిషిని జాబ్ నుండి తీసేసీ సెక్యూరిటీ పోస్ట్ ఇస్తుంది కావ్య. ఇలా ఎవరైనా ఆఫీస్ కి ద్రోహం చెయ్యాలని చూస్తే ఇలా సెక్యూరిటీ జాబ్ కాదు.. ఇక పోలీస్ స్టేషనే అని కావ్య ఎంప్లాయిస్ కి వార్నింగ్ ఇస్తుంది. మేడమ్ మీకు పెళ్లి అయి ఎన్ని రోజులు అవుతుంది. ఆరు నెలలు అవుతుందా అని శృతి కావ్యని ఆడుతుంది. నీకు తెలియదా.. ఆరు నెలలు మూడు సార్లు అయింది.. ఎందుకు అడిగావని కావ్య అనగానే.. ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట మీరు రాజ్ సర్ లాగే చేస్తున్నారని శృతి అంటుంది.

వాళ్ళిద్దరు ఒక్కటయ్యారు.. ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -234 లో.....సీతాకాంత్ ఇంటికి వస్తుంటాడు. రామలక్ష్మి ఫోన్ చేస్తే సీతాకాంత్ ఫోన్ కల్వకపోవడంతో రామలక్ష్మి టెన్షన్ పడుతూ.. సీతాకాంత్ కోసం వెతుక్కుంటూ వస్తుంది. మరొకవైపు అభి సీతాకాంత్ ని చంపడానికి కత్తితో వస్తాడు. సీతాకాంత్ కార్ ఆగిపోతుంది. కార్ దిగి ఏమైందోనని సీతాకాంత్ చూస్తుంటాడు. అభి తన వెనకాల కత్తితో వస్తాడు. అప్పుడే సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. ఏమైందంటూ అడిగి తనని ఇంటికి తీసుకొని వెళ్తుంది.

Brahmamudi : ఆఫీస్ లో దొంగని కనిపెట్టిన కావ్య.. రాజ్ ఆ పాస్ వర్డ్ కనిపెట్టగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -548 లో.....కావ్య సీఈఓ గా అప్పాయింట్మెంట్ అయిన లెటర్ రాజ్ కి ఇస్తుంది. అది చదివి రాజ్ షాక్ అవుతాడు. ఎందుకు తాతయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ కోప్పడతాడు. అప్పుడే కావ్యకి సీతారామయ్య ఫోన్ చేస్తాడు. వాడేం అంటున్నాడని అడుగుతాడు. రాజ్ కావ్యపై కోప్పడడం సీతారామయ్య వింటాడు. అప్పుడే శృతి మేడమ్ కి మీరు బొకే ఇవ్వండి అనగానే కోపంగా కింద పడేసి మా తాతయ్యతో తేల్చుకుంటానని వెళ్తాడు. విన్నారా తాతయ్య ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నాడని కావ్య ఫోన్ లో లైన్ లో ఉన్న సీతారామయ్యకి చెప్తుంది.

నన్ను అలా రక్తంతో చూసేసరికి పిచ్చోడయిపోయాడు

బుల్లితెర నటి శ్రీవాణికి రీసెంట్ గా రోడ్ యాక్సిడెంట్ ఐన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడిప్పుడే కోలుకుని తన ఇంటికి వచ్చింది. దాంతో ఆమె తన కోసం ప్రార్దించిన వారందరితో మాట్లాడాలి అనుకుని ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. తనకు యాక్సిడెంట్ ఐనప్పుడు అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వాళ్ళు మరీ నీచంగా చూసిన విధానం అలాగే ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కానిస్టేబుల్ చెప్పిన సమాధానం పై వాళ్ళు ఫైర్ అయ్యారు. కనీసం ఆ హాస్పిటల్ లో ఫస్ట్ ఎయిడ్ చేయకుండా అలా చూస్తూ ఉన్నారని చెప్పుకొచ్చింది.

నా మీద ఏమైనా ఫీలింగ్ ఉంటే చెప్పు..... ఇక్కడితో ఆపేద్దాం!

బిగ్ బాస్ ప్రేమ కథ ముగింపుకి వచ్చింది. ఇన్ని రోజులుగా లవ్ బర్డ్స్ గా అనుకున్న విష్ణు-పృథ్వీల మధ్య ఇక ఏం లేనట్లేనా అంటే.. లేదనే చెప్పాలి. నిన్న హౌస్ లో నామినేషన్ లో ప్రక్రియలో భాగంగా విష్ణు, పృథ్వీలని నామినేట్ చేసిన వాళ్లంతా కామన్ గా చెప్పిన పాయింట్ ఒక్కటే.. అదే గేమ్ ఆడట్లేదు.. ఇద్దరే ఉంటున్నారు. పృథ్వీతో ఉంటున్నావ్.. నీ ఇండివిడ్యువల్ గేమ్ ఆడట్లేదు.. ఫోకస్ చెయ్యట్లేదని విష్ణుప్రియని నామినేట్ చేసారు. అలాగే పృథ్వీని కూడ అలాగే అంటూ నామినేషన్ చేశారు. అంటే టెలికాస్ట్ చేసే గంటలోనే అంత ట్రాక్ గా చూపిస్తే హౌస్ లో ఉన్న వాళ్లందరు.. అక్కడ ఇరవై నాలుగు గంటలు వాళ్ళని అబ్ సర్వ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్లకు అలా అనిపించింది.

Brahmamudi : నా నిర్ణయం ఫైనల్.. రాజ్ కి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -547 లో.....కళ్యాణ్ పాడిన పాట నచ్చిన ప్రొడ్యూసర్ తనకి కొంతడబ్బు ఇచ్చి.. మీరేం చేస్తారో మీరు డిసైడ్ అవ్వండి. ఈ పాటని నేను వాడుకుంటున్నానని ప్రొడ్యూసర్ రైటర్ తో చెప్పి వెళ్లిపోతాడు. కళ్యాణ్ దగ్గరున్న డబ్బులు రైటర్ తీసుకొని కొంత డబ్బులు మాత్రమే కళ్యాణ్ కి ఇస్తాడు. నాకు అసిస్టెంట్ రైటర్ గా ఛాన్స్ ఇవండీ అని కళ్యాణ్ అనగానే.. అబ్బా అంత ఆశ ఉందా.. టచ్ లో ఉండు అంటూ రైటర్ కళ్యాణ్ ని వాడుకోవాలని కార్డు ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత రాజ్ వెళ్లేసరికి ఫ్యూన్ ఎండీ చైర్ లో కూర్చొని క్లీన్ చేస్తుంటాడు. అప్పుడే రాజ్ తనపై కోప్పడతాడు