ప్రియాంక సింగ్ ఇంట్లో విషాదం..
బుల్లితెర మీద కనిపిస్తూ నవ్వించే ప్రియాంక సింగ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియాంక తండ్రి బీబీ సింగ్ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రియాంక సింగ్ ప్రకటించింది. తన తండ్రితో తీసుకున్న ఓ వీడియోన పోస్ట్ చేసి "మిస్ యూ డాడీ" అని కాప్షన్ పెట్టి తన తండ్రి అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఫాలోవర్స్, ఫ్రెండ్స్ అంతా బిబి సింగ్ కు నివాళి అర్పించి ప్రియాంక సింగ్ కి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈమె బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించింది.