English | Telugu

జూనియర్ ఎన్టీఆర్ పై బాలకృష్ణ, చంద్రబాబు కామెంట్స్..!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. మూడూ ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ తో అలరించడానికి సిద్ధమైంది. (Unstoppable with NBK Season 4)

అక్టోబర్ 25 నుంచి అన్ స్టాపబుల్ సీజన్-4 ప్రసారం కానుంది. మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడు రావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రోమో ఎమోషనల్ గానూ, ఎంటర్టైనింగ్ గానూ సాగింది. ఇందులో రాజకీయ అంశాలతో పాటు, కుటుంబ విషయాలను కూడా చంద్రబాబు పంచుకున్నారు. (Nara Chandrababu Naidu)

అయితే ఈ షోలో చంద్రబాబుకి పలు పదునైన ప్రశ్నలను బాలకృష్ణ సంధించినట్లు తెలుస్తోంది. అభివృద్ధికి పెట్టపీట వేసే బాబు, ఓట్ల కోసమే సంక్షేమ బాట పట్టారా? 50 రోజుల జైలు జీవితం నేర్పిన పాఠాలేంటి? జనసేనతో బంధం ఎన్నేళ్లు ఉంటుంది? లోకేష్ కి తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? వచ్చే ఎన్నికలకు ముందు సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తారా? జాతీయ రాజకీయాలపై బాబు ఫోకస్ పెట్టనున్నారా? ఇలా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు బాలకృష్ణ, చంద్రబాబు మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ గురించి ఈ ఇద్దరు ఏం మాట్లాడారనే ఆసక్తి నెలకొంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...