English | Telugu

పవన్ కళ్యాణ్ గారి తాలూక.. గాజులేసుకోండి ఆది!

శ్రీదేవి డ్రామా కంపెనీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి కమిటీ కుర్రాళ్ళు మూవీ టీమ్ సరదాగా ఫన్ చేయడానికి వచ్చింది. దాంతో ఇక్కడ రెండు వర్గాల మధ్య పోటీ గట్టిగా జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వెర్సెస్ కమిటీ కుర్రాళ్ళుగా ఈ షో మారిపోయింది. ఇక ఇందులో రెండు టీమ్స్ మధ్య డైలాగ్స్ వరద మాములుగా లేదు. రైటర్ త్రివిక్రమ్ కూడా తక్కువే. అన్ని డైలాగ్స్ వీళ్ళు చెప్పారు. "ఏమిటి మేము లేకుండా జాతర జరిపిస్తున్నారు..కమిటీ కుర్రాళ్ళు ఇక్కడ" అని ఆ మూవీ టీమ్ ఆదికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. " పది రోజుల క్రితం ఈటీవీ విన్ కి వచ్చిన మీకే అంత ఉంటే పదేళ్ల నుంచి ఈటీవీలో ఉన్న మాకు ఎంతుండాలి" అన్నాడు ఆది.