English | Telugu

Karthika Deepam2 : ఆస్తులపై కన్నేసిన జ్యోత్స్న, పారిజాతం.. కార్తీక్ ఏం చేస్తాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -187 లో....పారిజాతం హాల్లో కూర్చొని టీ తాగుతుంటుంది. అప్పుడే గుడి నుండి సుమిత్ర ఇంటికి వస్తుంది. నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని పారిజాతం అనగానే.. ప్రశాంతత కోసం వెళ్ళాను. మీ ఆలోచనలతో నా కూతురు మనసు ని పాడుచేశారు. మీకు వయసు పెరిగింది అంతే అర్థం చేసుకునే మనసు పెరగలేదని సుమిత్ర అనగానే.. పారిజాతానికి కోపం వస్తుంది. ఎంత మాట అన్నావ్.. నీ సంగతి చెప్తానని అనుకుంటుంది పనిమనిషి వచ్చి పారిజాతానికి సెటైర్ వెయ్యడంతో పారిజాతానికి కోపం పెరుగుతుంది. 

Brahmamudi : మీటింగ్ కి వచ్చిన రాజ్.. చూసావా ఇది నీ స్థానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -552 లో.....రాజ్ కూరగాయలు పట్టుకొని ఇంటికి వస్తాడు. తనని చూసి రుద్రాణి భయపడి గట్టిగ అరుస్తుంది. దాంతో అందరు హాల్లోకి వస్తారు. ఏమైంది అత్త అలా అరిచావని రాజ్ అడుగుతాడు. నువ్వు కూరగాయల షాప్ ని పట్టుకొని వస్తుంటే.. భయమేసిందని రుద్రాణి అంటుంది. ఇక ఆ తర్వాత ఇదిగోండి.. మీరు చెప్పిన కూరగాయలు అని రాజ్ చెప్తాడు. ఒక కంపెనీకి సీఈఓ అయి ఉండి ఇలా చెయ్యడం బాధగా లేదా అని రుద్రాణి అనగానే.. ఎందుకు బాధ కన్నతండ్రికి తల్లికి లేని బాధ ఎందుకని రాజ్ అంటాడు.