English | Telugu

బీబీ రాజ్యం టాస్క్ లో రాయల్స్ గెలుపు.. ఓజీకి పరిణామం ఏంటంటే!


బిగ్ బాస్ సీజన్-8 లో మొన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.‌ ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని నామినేషన్ లో ఉన్నారు. ఇక అవినాష్ జిమ్ ట్రైనర్ గా చేసి నవ్వించాడు. దాంతో హౌస్ లో కిచెన్ లోని టైమ్ రెండు గంటలు పెరివింది. దాంతో పాటు హౌస్ లోకి అతి ముఖ్యమైన కూరగాయలు, పండ్లు పంపించాడు‌ బిగ్ బాస్.

ఇక హౌస్ లో టాస్క్ లో పరంపర మొదలెట్టాడు బిగ్ బాస్. టాస్క్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే... ఒక రాజ్యాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదు.. అలా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన వనరులని, సంస్థలని మీరు సమకూర్చుకోవాలి. సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల తర్వాత బీబీ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి మీరు పోటీ పడతారు.. ఎవరైతే రాజ్యాన్ని నిర్మిస్తారో వాళ్లకి ప్రయోజనం.. విఫలమైన క్లాన్ తగిన పరిణామాలు ఎదుర్కోవాలంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు

మొదటి టాస్క్ ని మొదలెట్టాడు బిగ్‌బాస్. నీరు చాలా ముఖ్యమైన వనరు.. రాజ్యం బావుండాలంటే నీటి సదుపాయం చాలా అవసరం.. తాగడానికి నీళ్లు లేకపోతే అది థూళితో సమానం.. కాబట్టి అలాంటి నీటినిచ్చే సరస్సును పొందడానికి ఇచ్చే టాస్కు.. 'నీరు, మీరు.. మధ్యలో అక్వైరియం'. ఈ టాస్కులో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా.. కళ్లకి గంతలు కట్టుకొని మీకు సంబంధించిన అక్వైరియంలో నీళ్లు పోయాలి.. బజర్ మోగే సమయానికి ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్లే విజేతలు.. గెలిచినవాళ్లు సరస్సుపై మీ జెండాను పాతొచ్చంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్కులో రాయల్స్ క్లాన్ గెలిచింది.
ఇక టాస్కులో గెలిచిన రాయల్స్ క్లాన్‌కి ఓ ప్రయోజనం ఉందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. మీలో ఒకరికి నేరుగా మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం.. అది ఎవరో మీరే నిర్ణయించుకొని అడిగినప్పుడు చెప్పండి అంటూ బిగ్‌బాస్ అన్నాడు. మరోవైపు ఓడిపోయినందుకు ఓజీ క్లాన్ మీ నుంచి ఒకరిని మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించాలి.. అది నిర్ణయించి బిగ్‌బాస్ అడిగినప్పుడు చెప్పండి.. అంటూ చెప్పాడు. కంటెండర్ రేస్ నుండి యష్మీ తప్పుకుంది. రాయల్ క్లాన్ నుండి రోహిణి డైరెక్ట్ గా మెగా ఛీఫ్ కోసం ఎన్నికైంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...