గుప్పెడంత మనసు సీరియల్ టీంని మిస్సవుతున్నాం
గుప్పెడంత మనసు సీరియల్ ఓ రేంజ్ లో ఆడియన్స్ ని అందులోనూ లేడీ ఫాన్స్ ని ఆకట్టుకుంది. రిషి, వసుధారా, శైలేంద్ర, ధరణి జోడీలుగా నటించారు. ఇక ఈ సీరియల్ ఐపోయాక ఆడియన్స్ అంతా కూడా కొంచెం డల్ ఐనట్టే కనిపిస్తున్నారు. రిషి సర్ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. ఐతే ఇప్పుడు రిషి సర్ ఒక మూవీలో నటిస్తున్నాడు. అలాగే జగతి మేడం కూడా మూవీస్ లో నటిస్తోంది. ఇక ధరణి, సురేష్ బాబు, సాయి కిరణ్ వేరే సీరియల్స్ లో నటిస్తున్నారు.