English | Telugu

హరితేజ వరెస్ట్ నామినేషన్.. ప్రేరణ బెస్ట్ డిఫెండ్!

బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం నామినేషన్ల ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. ఈ వారం ఒక్కరినే బిగ్ బాస్ తగిన కారణం చెప్పి నామినేట్ చెయ్యమని చెప్తాడు. దాంతో ప్రేరణని నామినెట్ చేస్తుంది హరితేజ. వాళ్లకి మొదటి నుండి రచ్చ నడుస్తుంది. ఇక హరితేజ తన మనసులో ప్రేరణపై ఉన్న ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కింది. ఇక ముందు మన మధ్యలో ఎలాంటి మనస్పార్ధలు ఉండకూడదు. ఏదైనా రీజన్ ఉంటే చేసుకోవాలి కానీ ఈ రీజన్ తో చేసుకోకూడదు ఇదే ఇక లాస్ట్ నామినేషన్ అని హరితేజ అంటుంది .

నువు ఫస్ట్ నుండి నన్ను ఫేక్ అంటున్నావ్.. నీకు ఎందుకు ఆలా అనిపించిందో తెలియదు.. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని హరితేజ అంటారు. నన్ను ఫేక్ అంటే అది తీసుకోవడానికి చాలా హర్టింగ్ గా ఉంది.. ఒక సిచువేషన్ లో జరిగింది చెప్పడం లో కన్ఫ్యూషన్ అయి ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయాను. దాన్ని నువ్వు ఫ్లిప్, ఫేక్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావ్.. మెల్లి ఉన్నోడోకి లోకమంత మెల్లి లాగా కన్పించినట్లు ఉంటుందని హరితేజ అంటుంది. నేను నిన్ను ఫేక్ అన్నట్లు ఏదైనా రికార్డింగ్ ఉంటే చూపించు.. అప్పుడు నమ్ముతానని ప్రేరణ అంటుంది. ఇన్ని మాటలా అంటూ హరితేజ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక ఆ తర్వాత ప్రేరణ నామినేషన్ కి అంగీకరించి కలర్ నీళ్ళు పోసుకుంటుంది‌.

ఆ తర్వాత హరితేజని ప్రేరణ నామినేట్ చేస్తుంది. హరి తేజ చేసిన నామినేషన్ కి అన్ని పాయింట్స్ కి సరైన వివరణ ఇస్తుంది ప్రేరణ. కానీ హరితేజ వాటికి అగ్రీ అవ్వట్లేదు. ఆ తర్వాత హరితేజపై కలర్ వాటర్ పడ్డాక హరితేజకి ప్రేరణ టవల్ ఇస్తూ.. ఇక మన మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదని ప్రేరణ అనగానే..సరే అయితే హగ్ చేసుకోమని హరితేజ అంటుంది. వెంటనే కలర్ ఉందని చూడకుండా ప్రేరణ వెళ్లి హరితేజని హగ్ చేసుకుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.