English | Telugu

మాజీ ప్రియుడు కాల్.. భర్తకి రాంగ్ నెంబర్ అని చెప్పిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -244 లో.....సిరి లేవగానే ఎదురుగా గోడపై చిన్న పిల్లల ఫొటోస్ ఉంటాయి. వాటిని చూసి సిరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి నీకు హ్యాపీగా ఉందా అని అడుగుతుంది. ధన తన సొంత టాలెంట్ తో పైకి రావాలని నీకు దూరంగా ఉంటున్నాడు. అంతే తప్ప కావాలని కాదు.. నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ ఫొటోస్ నేనే పెట్టానని రామలక్ష్మి చెప్తుంది. దాంతో సిరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా సీతాకాంత్ చూసి తను కూడా సంతోషపడతాడు.

ఆ తర్వాత సిరి దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. నీకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేశానని అంటాడు. నీకెందుకు అన్నయ్య శ్రమా అని సిరి అనగానే.. నీ విషయంలో ఎప్పుడు అలా అనిపించదని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఆఫీస్ వర్క్ చేస్తుంటే.. అప్పుడే అభి ఫోన్ చేస్తాడు
అభి నువ్వా అని రామలక్ష్మి మాట్లాడుతుంటుంది. అదంతా సీతాకాంత్ వింటాడు. నీతో మాట్లాడాలని అభి అనగానే.. రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఎవరు రామలక్ష్మి ఫోన్ అంటూ సీతాకాంత్ వస్తాడు. ఇప్పుడు అభి గురించి ఎందుకని రామలక్ష్మి చెప్పదు. రాంగ్ నెంబర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పడం లేదని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతున్నారని చెప్పగానే.. మన ప్లాన్ కి ఆ రామలక్ష్మి బలి అవుతుందని శ్రీలత అంటుంది.

ఆ తర్వాత నందినిని అభి కలిసి మాట్లాడతాడు. అదంతా డిటేక్టివ్ అభిని ఫాలో అవుతూ చూస్తాడు. నందినితో అభి మాట్లాడడం ఫోటో తీస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ తను రామలక్ష్మి దిగిన ఫోటోని చూస్తూ.. నాకు అభి గురించి ఎందుకు చెప్పడం లేదని అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి తను పంపిన కొటేషన్ ఒకే అయింది అని కాల్ వస్తుంది. దాంతో ఈ విషయం సీతా సర్ కి చెప్పాలని కార్ లో వెళ్తుంది. తనని ఫాలో అవుతు అభి వెళ్తాడు. కావాలనే అభి తన ముందు నుండి వెళ్తాడు. తను కచ్చితంగా అభినే వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నాడో ఇంకొకసారి రాకుండా చెయ్యాలని రామలక్ష్మి తన వెనకాలే వెళ్తుంది.. మరొక వైపు అభి ఇంటి దగ్గర డిటెక్టివ్ వెయిట్ చేస్తుంటాడు. అతి కష్టం మీద అభి అడ్రెస్ కనుకున్నానని అనుకుంటాడు. అప్పుడే అభి వచ్చి ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడే రామలక్ష్మి కూడా అక్కడికి రావడంతో అక్కడే ఉన్నా డిటేక్టివ్ అభి దగ్గరికి రామలక్ష్మి రావడం చూసి సీతాకాంత్ సర్ భార్య ఎందుకు వచ్చారనుకుంటాడు..ఆ తర్వాత రామలక్ష్మి అభి దగ్గరికి వెళ్లి మళ్ళీ ఎందుకు వచ్చావంటూ కోప్పడుతుంది. అభి, రామలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు డిటెక్టివ్ ఫోటో తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.