English | Telugu

Hariteja elimination: ఈ వారం హరితేజ ఎలిమినేషన్ కన్ఫమ్.. నెటిజన్ల కామెంట్ల మోత!


బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక ఆట మాములుగా లేదు. ఎంటర్టైన్మెంట్ కి, గేమ్స్ కి ఒక్కో కంటెస్టెంట్ తమ వంద శాతం ఇస్తున్నారు‌. అయితే హౌస్ లోకి వచ్చిన హరితేజ తీవ్రంగా డిస్సపాయింట్ చేస్తోంది.

టాస్క్ లలో తనే ఉండాలని భావనతో మొన్నటి వారం జరిగిన టాస్క్ లలో నిఖిల్ కి అన్యాయం చేసింది. అదంతా చూసిన నెటిజన్లు ఈమెని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదంటూ నెగెటివ్ కామెంట్లు చేశారు. అసలెమీ ఆడటం చేతకాని వాళ్ళని హౌస్ లోకి తీసుకొచ్చారంటూ హరితేజ పేరు మీద పోస్టులు, ట్వీట్లు చేశారు. దాంతో గత మూడు వారాల నుండి నామినేషన్ల చివరన ఉన్నా‌‌.. వేరే వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారు. లాస్ట్ వీక్ కూడా నయని పావని కంటే హరితేజ మధ్య ఓటింగ్ పెద్దగా డిఫరెన్స్ లేదు. దీనిని బట్టి తను హౌస్ లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదని తెలిసిపోతుంది.

ఇక ఈ వారం నిఖిల్, గౌతమ్, యష్మీ, ప్రేరణ ఇలా స్ట్రాంగ్ ఓటింగ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. దాంతో హరితేజ ఎలిమినేషన్ కన్ఫమ్ అనేది తెలుస్తోంది. ‌తనేదైనా పర్ఫామెన్స్ ఇస్తేనే సేఫ్ అవుతుంది.‌ లేదంటే కచ్చితంగా ఈ వారం హరితేజ బ్యాగ్ సర్దుకోవాల్సిందే. అయితే ఈ సీజన్ లో హరితేజ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదనేది అందరికి తెలిసిన విషయమే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.