English | Telugu

బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసేది ఈ వారమే.. మరి మీ ఫేవరెట్ ఎవరు?

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని పదో వారంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు అందరి ఆటతీరు చూసిన ప్రేక్షకులు.. ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ బయటకు రావడంతో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.

హౌస్ లోకి శేఖర్ బాషా ఎంట్రీ కాగానే అందరు తనే విన్నర్ అంటూ సోషల్ మీడియా వార్తలొచ్చాయి. అయితే అనూహ్యగా రెండవ వారమే బయటకు వచ్చాడు. ఇక మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కిర్రాక్ సీత టాప్-5 కంటెస్టెంట్ అనుకున్నారంతా కానీ తను కూడా అనుకోకుండా బయటకు వచ్చింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రతీ సీజన్ లో ఉండేదే. అదేంటంటే నామినేట్ చెయ్యాలనుకున్న వాళ్ళు తగిన కారణం చెప్పి పై నుండి మట్టి కలర్ పోస్తారు.. గత సీజన్ లలో రేవంత్, పల్లవి ప్రశాంత్ లకి ఎక్కువ నామినేషన్ లు పడటంతో.. ఎక్కవ మంది కలర్ పొయ్యడంతో ఒకరమైన అటిట్యూడ్ తో ఇద్దరు కనపడ్డారు. ముఖ్యంగా 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ లాగా ఫోజులిచ్చారు. ఎక్కువ నామినేషన్ లు పడడంతో వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యారు. దాంతో పాటు విన్నర్ కూడా అయ్యారు.

ఈ సారి నామినేషన్ లు ఎక్కువగా నిఖిల్, గౌతమ్ లకి పడినట్లు తెలుస్తుంది. ప్రోమోలో రోహిణి కలర్ పడి పుష్ప మాదిరి కూర్చొని ఉంటుంది. అచ్చం రేవంత్, ప్రశాంత్ ని కాపీ చేసినట్లు గా కన్పిస్తుంది. ఇక ఈ సీజన్ లో విన్నర్ ఎవరనే పాయింట్ లో మాట్లాడుకుంటే.. నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఈ వీక్ దాదాపు అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వస్తారు. ఎవరికి ఎంత ఓటింగ్ ఉందో దానిని బట్టి టాప్-5 లో ఎవరుంటారనే క్లారిటీ వచ్చేస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.