English | Telugu

Gangavva Elimination : మిడ్ వీక్ ఎలిమినేషన్ గా గంగవ్వ.. బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వనున్నాడా!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక ఆట స్వభావమే మారిపోయింది. అసలు మాములుగా సాగుతున్న హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అనడంలో సందేహమే లేదు. (Gangavva Elimination)

గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, హరితేజ, గౌతమ్ కృష్ణ, నయని పావని, మెహబూబ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. ఇక గంగవ్వ అయితే వచ్చిన రోజు పెట్టిన టాస్క్ లో వహ్వా అనిపించింది. అరవై ఏళ్ళ వయసులో కూడా కుర్రాళ్ళకి పోటీ ఇచ్చారు. అవినాష్- గంగవ్వ జలిసి ఆడిన ఆట చూసి బిబి ఆడియన్స్ అంతా అవాక్కయ్యారు. అయితే ఆ తర్వాత తను ఏ గేమ్ ఆడలేదు. అదే కాస్త ఇబ్బంది. హౌస్ లో అందరికి ఓ అవ్వ లెక్క బాగానే హౌస్ మేట్స్ అందరితో బాగుంటుంది. ఇంట్లో అమ్మతో ఉన్న ఫీలింగ్ ని గంగవ్వ ఇస్తుందనడంలో సందేహమే లేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే అందరితో బాగుంటేనే సరిపోదు కదా టాస్క్ లలో కూడా ఆడాలి. అది లేకుండా ఓటింగ్ లో జనాలు ఓట్లు కూడా చేయరు.

హౌస్ లో జరిగే ప్రతీ టాస్క్ లో గంగవ్వ ఓ సంఛాలక్ గా మాత్రమే కన్పిస్తుంది. అయితే సంఛాలక్ గా ఎన్ని టాస్క్ లని చేస్తుంది. ఇక బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కి కూడా ఆమెని ఎందుకు తీసుకొచ్చార్రా బాబు అని అనుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా అదే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. గంగవ్వని మిడ్ వీక్ ఎలిమినేషన్ గా బయటకు పంపించాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మిగిలిన వాళ్ళలో ఎవరు బాగా గేమ్ ఆడతారో వాళ్ళు హౌస్ లో ఉంటారు. ఆడనివాళ్ళు ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేస్తారు. గంగవ్వ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ప్రతీ గేమ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందనడంలో సందేహమే లేదు. మరి బిగ్ బాస్ మామ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడు? ఎలా చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.