English | Telugu

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ ని కలిసిన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ కిరాక్ సీత గురించి చెప్పక్కర్లేదు. ఆమె ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత ఆ తర్వాత హైదరాబాద్ ఉప్పల్ లో ఉంటోంది. ఆమె యూట్యూబ్ లో బోల్డ్ కంటెంట్ చేస్తూ ఉంటుంది. సీతకి 7 ఆర్ట్స్ లాంటి యూట్యూబ్ వీడియోల్లో అవకాశం వచ్చింది. సరయుతో కలసి చాలా వీడియోలు చేసింది. అలాంటి సీత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. అక్కడ ఆమె మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చింది.

ఇక సీత విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా రూపొందిన 'బేబీ' మూవీలో వైష్ణవి చైతన్య లైఫ్ ని నాశనం చేసే ఫ్రెండ్ రోల్ చేసి 'కిరాక్' సీతగా పాపులర్ అయ్యింది. అలాంటి సీతకు బిగ్ బాస్ లో సపోర్ట్ చేసే వాళ్ళు పెద్దగా ఎవరూ లేరు. దాంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బయటికి వచ్చిన సీత రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిశారు. బిగ్ బాస్ లో గేమ్ ఆడేటప్పుడు తన సపోర్ట్ చేసిన మంత్రి ఫరూక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది సీత. అలాగే సీత ఇప్పుడిప్పుడే అటు మూవీస్ లో ఇటు యూట్యూబ్ వీడియోస్ లో కనిపిస్తోంది. అలాగే అలాగే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తానూ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఫార్మ్ హౌస్ కి, ఫారెన్ ట్రిప్ కి రావాలని చెప్తూ కొన్ని లక్షల ఆఫర్ తో ఒక మూవీ వచ్చినా తానూ రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.


Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.