English | Telugu

గౌతమ్, నిఖిల్ ల మధ్య ముదిరిన గొడవ.. అశ్వగంధ ఈజ్ బ్యాక్!

బిగ్ బాస్ సీజన్-8 లో భాగంగా ఎన్నో వింతలు జరుగుతున్నాయి. మొదటగా ఓ మాస్క్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. అందరు గుర్తుపట్టి గౌతమ్ అన్నా మాస్క్ తీయలేదు. ఇక అశ్వథ్థామ అనగానే మాస్క్ తీసి .. ఐ ఆమ్ బ్యాక్ అన్నాడు మన గౌతమ్ కృష్ణ. ఇక అది చూసిన ట్రోలర్స్ వీడికి ఇంకా తగ్గలేదుగా అని అనుకున్నారు.

గత నామినేషన్ మళ్లీ చూస్తున్నామా అనేలా గౌతమ్ నిఖిల్ ల మధ్య మరో నామినేషన్ వేదిక అయింది. నువ్వా నేనా అంటూ ఇద్దరు పొట్లాడుకున్నారు. మొదటగా గౌతమ్ ని నిఖిల్ నామినేట్ చేస్తూ.. ఒక అమ్మాయి తనని అక్క అనడం ఇష్టం లేదని చెప్పినప్పుడు నువ్వు వదిలెయ్యాలి. కానీ నువ్వు అలా కాకుండా ప్రతిసారీ అలా అంటే తనకి ఎలా ఉంటుందని ఒక పాయింట్.. టాస్క్ సంబంధించిన టూ పాయింట్స్ చెప్పాడు. కానీ యష్మీ విషయం గురించి నిఖిల్ మాట్లాడడంతో గౌతమ్ కి కోపం వస్తుంది. నేను అక్క అనడం తప్పు కాదు అది రెస్పెక్ట్ అని గౌతమ్ అంటాడు. నీకు మొదట అశ్వథ్థామ అంటే ఎందుకు నచ్చలేదు. నువ్వు ఎందుకు తీసుకొలేదు. అక్క అంటే కూడా తను అలాగే తీసుకోలేదని నిఖిల్ అంటాడు. అశ్వథ్థామ అనాలని అనుకుంటే అను మచ్చా అంటూ గౌతమ్ అన్నాడు. బయట ట్రోల్స్ జరిగాయి అందుకే తీస్కో లేదు అక్క అంటే ఏం అయింది.. ఇప్పుడు చెప్తున్నా ఎవడికి భయపడేది లేదు అశ్వథ్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్ గట్టిగా అరుస్తాడు.

నీకు దమ్ముంటే బయటకు పదా చూసుకుందామని నిఖిల్ అంటాడు. పద చూసుకుందామంటూ ఎక్సైట్ గా ఇద్దరు గేట్ దగ్గరికి వెళ్లి.. గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇక ఎవరికి భయపడేది లేదు.. ఎవడు ఇష్టమున్నట్లు వాడు రాసుకొనియ్.. ట్రోల్స్ చేసుకొనియ్.. తగ్గేదేలే అంటూ కలర్ పడే స్థానంలో కూర్చొని ఉంటాడు అశ్వగంధ అలియాస్ గౌతమ్ కృష్ణ!

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.