English | Telugu
Karthika Deepam2: శ్రీధర్ జైలుకి వెళ్ళడానికి కారణం కాశీనే.. కార్తీక్ షాక్!
Updated : Dec 23, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -547 లో....శ్రీధర్ ని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో కాంచనకి పారిజాతం పంపిస్తుంది. అది చూసి కాంచన షాక్ అవుతుంది. కాంచనకి పారిజాతం ఫోన్ చేస్తుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావ్.. నువ్వు నీ తండ్రి కడుపున ఎందుకు పుట్టావే.. ఆయన పరువు తియ్యడానికి పుట్టావ్.. నీ కోడలు ఇచ్చిన సలహా వల్ల ఇదంతా జరిగిందని పారిజాతం ఇష్టమొచ్చినట్లు తిడుతుంటే తనపై కాంచన కోప్పడుతుంది.
మరొకవైపు దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. దీప గురించి తప్పుగా మాట్లాడుతుంది. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు. నువ్వు ఇంట్లో అడుగుపెట్టగానే శ్రీధర్, కాంచన దూరం అయ్యారు. ఇప్పుడు తన కడుపులో బిడ్డ ఉందని తెలిసింది శ్రీధర్ స్టేషన్ కీ వెళ్ళాడు అని పారిజాతం అంటుంది. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడొద్దని దీప కోప్పడుతుంది. ఆ తర్వాత వైరాకి జ్యోత్స్న ఫోన్ చేసి ప్లాన్ ఎక్కడికి వచ్చిందని అడుగుతుంది. ఒకే అయిందని వైరా చెప్తాడు. నేను సీఈఓ కాగానే ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మీకే అని జ్యోత్స్న తనకి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఒరేయ్ వైరా ఒకసారి నేను సీఈఓ అవనివ్వు ఆ తర్వాత నీతో నాకేంటి రా అని జ్యోత్స్న కన్నింగ్ గా ఆలోచిస్తుంది. మరొకవైపు శ్రీధర్ ని బెయిల్ పై విడిపించడానికి శివనారాయణ, కార్తీక్ ఇద్దరు లాయర్ ని తీసుకొని వెళ్తారు. బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ఆయన ఫుడ్ పాడైందని చెప్పినా వినకుండా డిస్టిబ్యూట్ చెయ్యమని చెప్పారట.. అందుకు సంబంధించిన ఆడియో అని ఇన్‌స్పెక్టర్ వినిపిస్తాడు. అందులో సర్ ఫుడ్ మిగిలిపోయిందని కాశీ అంటాడు. డిస్టిబ్యూట్ చెయ్యండి అని శ్రీధర్ చెప్తాడు.
ఆ ఆడియో ఎవరు పంపారని కార్తీక్ అనగానే అప్పుడే కాశీ వస్తాడు. తనే అని ఇన్‌స్పెక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. వైరా గారు చెప్పినట్లు మాట్లాడానని కాశీ అనుకుంటాడు. అసలు ఏమైందని కార్తీక్ అడుగుతాడు. నేను జరుగింది చెప్పాను బావ అని కార్తీక్ అంటాడు. విన్నారుగా అయనే ఫుడ్ డిస్టిబ్యూట్ చెయ్యమని చెప్పారని తన పిఏనే ఒప్పుకున్నాడు అని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. లాయర్ వెళ్ళిపోతాడు. ఒరేయ్ నువ్వు కాశీని ఏం అనకు తనని దారిలో పెట్టాలని చూస్తే తనకే శత్రువు అయ్యానని కార్తీక్ కి చెప్తూ శ్రీధర్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.