English | Telugu

Karthika Deepam 2: హాస్పిటల్ లో సుమిత్ర.. పోలీస్ స్టేషన్ లో శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -546 లో... కార్తీక్ దగ్గరకి దీప కంగారుగా వస్తుంది. నోటిలో నుండి బ్లడ్ ఎందుకు వస్తుందని అడుగుతుంది. ఏదైనా వ్యాధి ఉంటే వస్తుందని కార్తీక్ అనగానే మా అమ్మ నోట్లో నుండి రక్తం వచ్చిందని దీప అంటుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. నాకు భయంగా ఉందని దీప టెన్షన్ పడుతుంటే.. నువ్వేం టెన్షన్ పడకు నోట్లో ఏదైనా పుండ్లు అయినా అలా అవుతుందని దీపకి చెప్తాడు కార్తీక్. కానీ కార్తీక్ కి కూడా టెన్షన్ అవుతుంది. పదా వెళ్లి మావయ్యని అడుగుదామని కార్తీక్ అంటాడు.

ఇద్దరు దశరథ్ దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతారు. ఏమోరా చాలా రోజుల నుండి నీరసంగా ఉంది అని అంటుందని దశరథ్ చెప్తాడు. మీరు అర్జెంట్ గా అత్తయ్యని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళండి అని కార్తీక్ అంటాడు. అప్పుడే సుమిత్ర వచ్చి నాకు ఏమైంది రా హాస్పిటల్ కి అంటున్నారని అడుగుతుంది. మా ఫ్రెండ్ ధరణి చెప్పిందా నీరసంగా ఉందని టెస్ట్ లు చేయించుకోమని అని సుమిత్ర అంటుంది. నాకు బాలేదు సుమిత్ర వెళ్లి టెస్ట్ లు చేయించుకుంటా వెళదామా అని దశరథ్ అంటాడు. అయ్యో ఏమైంది పదండి అని సుమిత్ర టెన్షన్ పడుతుంది. సుమిత్రని హాస్పిటల్ కి రమ్మంటే రాదని దశరథ్ అలా అబద్దం చెప్పి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు.

హాస్పిటల్ కి వెళ్ళాక సుమిత్రకి టెస్ట్ లు చేయమని డాక్టర్ చెప్తాడు. నాకు కాదు మా అయనకి అని సుమిత్ర అంటుంది. ముందు నువ్వు చేయించుకో తర్వాత నేను అని దశరథ్ అంటాడు. సుమిత్ర వెళ్ళాక డాక్టర్ తో దశరథ్ మాట్లాడుతాడు. నేను ఫోన్ లో చెప్పాను కదా డాక్టర్ అని అంటాడు.

మరొకవైపు నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల ఏమైందో చూడమని శ్రీధర్ ని పోలీసులు తీసుకొని వెళ్ళే వీడియో జ్యోత్స్న ఇంట్లో అందరికి చూపిస్తుంది. ఫుడ్ ట్రక్ అన్నారు. అందులో కల్తీ జరిగింది అని జ్యోత్స్న అంటుంది. అది చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఇదంతా అల్లుడు కావాలనే చేసాడు.. మీపై పగతోనే ఇదంతా అని శివన్నారాయణతో పారిజాతం అంటుంది. మా నాన్న అలాంటివాడు కాదని కార్తీక్ అంటాడు. మరి మీ అమ్మ ఎందుకు వదిలేసినట్లో అని పారిజాతం అంటుంది. ఆపండి అసలు ఇదంతా ఏంటని శివన్నారాయణ అంటాడు. ముందు మనం స్టేషన్ కి వెళదామని శివన్నారాయణని తీసుకొని కార్తీక్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.