Jayam serial: తనపై పడ్డ నిందని అబద్ధమని గంగ నిరూపించుకుంటుందా?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -154 లో... గంగ బస్తీలో ఉండే శేఖర్, శకుంతల వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. గంగకి ట్రైప్యాడ్ ఇచ్చింది నేనే అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏంటి అన్న అలా నా గురించి అబద్ధం చెప్తున్నావ్.. నన్ను నీ సొంత చెల్లిగా చూసావ్, ఇలా ఎలా అబద్ధం చెప్తున్నావని గంగ అడుగుతుంది.