English | Telugu

Bigg Boss 9 Telugu Family Week: హౌస్ లోకి సంజన ఫ్యామిలీ ఎంట్రీ.. ఎమోషనల్ ఎపిసోడ్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ‌ఇందులో భాగంగా రెండో రోజు కూడా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్  వచ్చారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబు వల్ల గతవారమే సంజన ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేసింది. నిన్నటి నుండి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంటే సంజన ఎమోషనల్ అయింది. ప్లీజ్ బిగ్ బాస్ నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అంటూ కెమెరాకి మొరపెట్టుకోవడం తెలిసిందే అయితే బిగ్ బాస్ కరిగిపోయి మిగతా కంటెస్టెంట్స్ తమ ఫ్యామిలీ వీక్ లోని కొంత టైమ్ సంజనకి త్యాగం చేయాలని చెప్తాడు.

Brahmamudi : రాహుల్ కి భాద్యతలు అప్పగించిన రాజ్.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -882 లో.. రాహుల్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రాజ్ ని కావ్య రిక్వెస్ట్ చెయ్యడంతో రాజ్ సరే అంటాడు. అందరు భోజనం చేస్తుండగా రాహుల్ ని రాజ్ పిలిపించి చేతిలో ఆఫీస్ లో జాయినింగ్ లెటర్ పెడతాడు. అది చూసి మనసులో సంతోషపడుతూనే బయటకు మాత్రం ఎందుకు నాకు ఇంత పెద్ద బాధ్యత అని యాక్టింగ్ చేస్తాడు. నేను ఆఫీస్ కి ఇప్పట్లో రాను నువ్వే ఆఫీస్ చూసుకోవాలని రాజ్ చెప్తాడు. చూసావా రుద్రాణి మా రాజ్ నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు. అది మంచి విషయం కాబట్టి మేం ఏం అడ్డుపడడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది.