English | Telugu
Bigg Boss Thanuja: బిగ్ సీజన్-9 రన్నరప్ తనూజ.. గోల్డెన్ ఛాన్స్ మిస్!
Updated : Dec 21, 2025
బిగ్ బాస్ సీజన్-9 ముగిసింది. కామనర్ పవన్ కళ్యాణ్ పడాల విజేత కాగా, తనూజ రన్నరప్ గా నిలిచింది. పదిహేను వారాల బిగ్ బాస్ ఎట్టకేలకు ముగిసింది. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ తో సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది.
ఇక ఈ సీజన్-9 లో సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా ఫస్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది తనూజ. ఇక అప్పటి నుండి తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ముఖ్యంగా ప్రతీ తెలుగింట్లో ఉండే ఓ సంప్రదాయమైనఅచ్చతెలుగు ఆడపిల్లలా అనిపించింది. ఎందుకంటే తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మాట్లాటే విధానం కానీ అలా అనిపించింది. ఇక గేమ్స్ పెరిగే కొద్దీ.. గొడవలు అవుతున్న కొద్దీ తనని హేట్ చేసేవాళ్ళు కూడా మొదలయ్యారు. అందుకే చివరి వరకు విన్నర్ పవన్ కళ్యాణ్ పడాలకి టఫ్ ఫైట్ ఇచ్చింది.
ఈ వీక్ మొదట్లో.. ఇమ్మాన్యుయేల్, సంజన, డీమాన్ పవన్,కళ్యాణ్ పడాల, తనూజ టాప్-5 లో ఉన్నారు. దాంతో అందరు తనూజ విన్నర్.. కళ్యాణ్ పడాల రన్నర్ అని అనుకున్నారు. కానీ ఓటింగ్ నాలుగో రోజు, అయిదో రోజు, చివరి రోజుకి వచ్చేసరికి లెక్కలన్నీ మారిపోయాయి. కామన్ మ్యాన్ కళ్యాణ్ కి ఆడియన్స్ భారీగా ఓట్లేశారు. దాంతో అతను విన్నర్ గా నిలిచాడు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లోకి వెళ్ళి టాప్-2 కి సూట్ కేస్ ఆఫర్ ఇవ్వగా తనూజ రిజెక్ట్ చేసింది. అయితే ఆ సూట్ కేస్ ఖరీదు.. ఇరవై లక్షలు.. అంటే మొత్తం ప్రైజ్ మనీ యాభై లక్షలు కాగా.. అందులో నుండి పదిహేను లక్షలు డీమాన్ పవన్ తీసుకున్నాడు. ఇక మిగిలింది ముప్పై అయిదు లక్షలు.. ఆ ప్రైజ్ మనీ నుండి ఇరవై లక్షలు ఆఫర్ చేశాడు నాగార్జున. కానీ తనూజఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. దాంతో తను గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకొని రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.