English | Telugu

Illu illalu pillalu: ఫ్రెండ్ ని నమ్మి మోసపోయిన సాగర్.. శ్రీవల్లికి చుక్కలే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -347 లో.. ప్రేమ వాళ్ళ నాన్నని ఇంట్లో దింపడం ధీరజ్ కి శ్రీవల్లి చూపిస్తుంది. ప్రేమ ఇంట్లోకి వస్తు ధీరజ్ ని చూస్తుంది.

ఆ తర్వాత ధీరజ్ కోపంగా ఉంటాడు. శ్రీవల్లి వచ్చి అదేంటి ఇద్దరు గొడవ పెట్టుకుంటారనుకుంటే ఇలా సైలెంట్ గా ఉన్నారు. ఎలాగైనా గొడవ పెట్టాలని అనుకొని ధీరజ్ దగ్గరికి వస్తుంది. అదేంటో ప్రేమ అసలు అర్థం కాదు.. ఆ ఇంటికి ఈ ఇంటికి గొడవలు ఉన్నాయని తెలుసు కదా.. మళ్ళీ వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళతో గొడవపడి మావయ్య గారి చొక్కా మళ్ళీ చింపేస్తారని శ్రీవల్లి చెప్తుంది. దాంతో ధీరజ్ కోపం మరింత ఎక్కువ అవుతుంది.

ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి ఒరేయ్ భోజనం చేద్దాం రా అని అంటుంది. ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావో నాకు తెలుసు కానీ మీ నాన్నకి ఏదైనా ప్రాబ్లమ్ అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను అలాగే రియాక్ట్ అయ్యానని ప్రేమ చెప్తుంది.

మరొకవైపు సాగర్ తన ఫ్రెండ్ మాటలు నమ్మి షేర్ మార్కెట్ లో డబ్బులు పెడతాడు. అవి కూడా కస్టమర్ కి రామరాజు ఇవ్వమన్న డబ్బుల్లో నుండి లక్ష రూపాయలు తన ఫ్రెండ్ కి ఇస్తాడు. కస్టమర్ దగ్గరికి వెళ్లి నాన్న ఒక లక్ష పంపాడు మిగతావి తర్వాత ఇస్తానన్నాడు అని సాగర్ చెప్తాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ నుండి ఎలాంటి కాల్ రాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో సాగర్ కి మోసపోయానని అర్థం అవుతుంది. అతను టెన్షన్ పడుతుంటే అప్పుడే నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఏం లేదని చిరాకుపడతాడు. నేను రైస్ మిల్ లో పని చేస్తున్నానని ఫీల్ అవుతున్నావా అని సాగర్ అడుగగా నేను ఎందుకు ఫీల్ అవుతాను.. లవ్ చేసినప్పుడు నువ్వు రైస్ మిల్ లో పని చేస్తావని తెలుసు కదా ఎందుకు ఫీల్ అవుతానని ఎమోషనల్ అవుతుంది. సాగర్ ని హగ్ చేసుకొని బాధపడుతుంది. ఎవరు అన్నారని నర్మద అడుగుతుంది ఇంట్లో వాళ్ళు అని సాగర్ అంటాడు. ఇంట్లో వాళ్ళు అంటే ఖచ్చితంగా ఆ వల్లి అయి ఉంటుందని నర్మద అనుకుంటుంది.

మరుసటి రోజు నర్మద, ప్రేమ కలిసి శ్రీవల్లితో ఒక ఆట ఆడాలనుకుంటారు. నాకు సాగర్ మధ్యలో గొడవ పెట్టాలని చూసిందని నర్మద అంటుంది. ధీరజ్ కి నాకు గొడవ పెట్టాలని ట్రై చేసిందని ప్రేమ అంటుంది. ఇద్దరు కలిసి స్వీట్ చేసి అందరికి ఇస్తారు. ఈ రోజు శ్రీవల్లి అక్క ఇంటర్వ్యూకి వెళ్తుంది కదా అని అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.