English | Telugu
జులై 26 వరకు ట్రిప్స్ కు వెళ్లడాన్ని అవాయిడ్ చేయండి..
Updated : Jul 23, 2025
ఎండలు తగ్గిపోయి వర్షాలు కురవడం మొదలయ్యాయి. అందులోనూ ఆగకుండా రెండు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలా వాతావరణ శాఖ కూడా జులై 26 వరకు అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. వరదలు వచ్చే సూచనలు ఉన్నాయంటూ కూడా ప్రజలను లేటెస్ట్ అప్ డేట్స్ ని అందిస్తూ అప్రమత్తం చేస్తోంది. ఇక సెలబ్రిటీస్ కూడా ఈ విషయంలో ఎవరికీ తోచినట్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టేటస్ లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక నటుడు సాయి కిరణ్ ఇదే విషయం మీద తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఈ అప్ డేట్ ని పోస్ట్ చేసాడు. "జులై 26 వరకు ట్రిప్స్ కు వెళ్లడాన్ని అవాయిడ్ చేయండి..
అలాగే సిద్ధంగా కూడా ఉండండి. కేరళ, కర్ణాటక, నార్త్ ఆంధ్ర ప్రదేశ్, గోవా, సౌత్ ఒడిశా, నార్త్ తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటు వరదలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి." అంటూ ఒక వెదర్ అప్ డేట్ ని పోస్ట్ చేసాడు. బుల్లితెర సెలబ్రిటీస్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకునేవారిలో ముందుండేది రష్మీ ఆ తర్వాత సాయికిరణ్ అలాగే రేణు దేశాయ్ ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు మూగ జీవాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఎవరి వీలును బట్టి వాళ్ళు అప్రమత్తం చేస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, మోటివేట్ చేయడం వంటివి చేస్తూ ఉన్నారు.