English | Telugu
తన పెళ్ళికి శేఖర్ మాష్టర్ ని, ప్రదీప్ ని రావద్దన్న ఆది..విగ్గు లాగేసి ప్రదీప్
Updated : Jul 20, 2023
ఈ వారం ఢీ ప్రీమియర్ లీగ్ లో సీనియర్ యాక్టర్ పృద్వి దీపికా పిల్లికి మావయ్య రోల్ లో వచ్చారు. హైపర్ ఆది రోబో మూవీలో "వసి" రోల్ లో వచ్చాడు. రోబోలను కనిపెట్టే సైంటిస్ట్ ని కానీ కొన్ని కనిపెట్టలేకపోతున్నా..మన శేఖర్ మాష్టర్ ఏ టైంకి ఎవరికీ ఫోన్ చేస్తున్నారో కనిపెట్టలేకపోతున్నా..పూర్ణ సాంగ్ కి సాంగ్ మధ్య గ్యాప్ లో కింద టేబుల్ మీద పెట్టుకుని ఎం తింటుందో తెలుసుకోలేకపోతున్నా, అక్షిత నాకు ఎందుకు కనెక్ట్ అయ్యిందో కనిపెట్టలేకపోతున్నా, భూమిక అడ్రస్ కనిపెట్టలేకపోతున్నాను" అని చాలా ఫ్రస్ట్రేషన్ ఫీలయ్యాడు ఆది. తర్వాత పృద్విని ఇంప్రెస్ చేసి దీపికా పిల్లిని పెళ్లి చేసుకోవడానికి హైపర్ ఆది తెగ తంటాలు పడ్డాడు. ఇక పృద్వి ఆదికి ఎన్నో టెస్టులు కూడా పెట్టారు..కళ్ళకు గంతలు కట్టించి అబ్బాయిల చేత ముద్దు పెట్టించారు.
ఆది లేడీస్ నేమ్స్ చెప్పాడు కానీ కళ్ళకు గంతలు తీసాక అబ్బాయిలను చూసేసరికి షాకయ్యాడు. తర్వాత ఒక ప్లేట్ లో పచ్చి మిర్చిని తెప్పించారు పృద్వి. ఇక ఆది పచ్చి మిర్చి "దాక్కో దాక్కో మేక" అని వగరుస్తూ సాంగ్ పాడాడు. సాంగ్ సరిగా పాడడం లేదని తెలిసి దీపికా పిల్లి వెళ్లి ఒక పచ్చి మిర్చికి ముద్దు పెట్టి ఆది నోటికి అందించి ఇప్పుడు పాట వచ్చేస్తుంది అని చెప్పడంతో "అందమైన కుందనాల బొమ్మరా" అని పాడేశాడు. తర్వాత ప్రదీప్ "ఒప్పుకో ఓడిపోయాను అని చెప్పు "అనేసరికి "ఏంటండీ మీరు ఇక్కడికి వచ్చి ఏడిపిస్తారు" అని ఆది పృద్విని అడిగేసరికి "పెళ్లయ్యాక ఇదే జరుగుతుంది కాబట్టి ఇప్పటినుంచే ప్రాక్టీస్ ఇది" అని చెప్పారు. "ఏడ్చినా పర్లేదు ముందు నాకు పెళ్లి చేయండి" అని ఆది అడిగేసరికి "నువ్వు నా టెస్టుల్లో ఫెయిల్ అయ్యావ్ నేను పిల్లను ఇవ్వను" అని చెప్పేసారు పృద్వి. దానికి కోపం వచ్చిన ఆది "దయచేసి నాకు ముసలావిడతో పెళ్లి కుదిరినా కూడా మీరు రావద్దు" అని శేఖర్ మాష్టర్ కి ప్రదీప్ కి చెప్పేసరికి ప్రదీప్ వచ్చి ఆది నెత్తి మీద ఉన్న విగ్గు లాగేసాడు. ఇక శేఖర్ మాష్టర్ అది చూసి గట్టిగా నవ్వేసాడు.