English | Telugu

సౌందర్యను పెళ్లి చేసుకోమన్నారు...అండర్ వరల్డ్ మాఫియాకు నేను బాగా తెలుసు


జెడి చక్రవర్తి అంటే చాలు ఒక సెన్సేషన్...యాక్టర్ గా, డైరెక్టర్ గా తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం..మనీ, సత్య, బొంబాయి ప్రియుడు ఇలా ఎన్నో హిట్ మూవీస్ లో నటించారు కూడా. అలాంటి చక్రవర్తి రీసెంట్ గా ఈషా రెబ్బా, విష్ణు ప్రియాతో కలిసి "దయా" అనే మూవీలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. "ఉగ్రం మూవీని అమ్మ రాజశేఖర్ గారి దగ్గర తీసుకుని ఎంఎంఓఎఫ్ మూవీగా రిలీజ్ చేయడంలో కొంత అటు ఇటు అవడంతో డైరెక్షన్ అవకాశాలు తగ్గాయా " అని అడిగిన ప్రశ్నకు "ఎంఎంఓఎఫ్ మూవీని నేను డైరెక్ట్ చేయలేదు..అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేశారు.

తర్వాత ఆయనకు ప్రొడ్యూసర్స్ కి క్లాషెస్ రావడంతో ప్రొడ్యూసర్స్ మూవీని టేక్ఓవర్ చేశారు. నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుని శిష్యుల్లో అమ్మ రాజశేఖర్ ఒకడు. మద్రాస్ లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి నా పేరు పెట్టుకున్నాడు. అతను డాన్స్ మాష్టర్ మాత్రమే కాదు ఫైట్ మాష్టర్ కూడా. "మీరు అప్పట్లో సౌందర్యగారిని పెళ్లి చేసుకోలనుకుంటా కదా" అని అడిగేసరికి "నేను అనుకోలేదు పెళ్లి చేసుకుందాం అని...డాన్స్ మాష్టర్ సుచిత్ర, డైరెక్టర్ ఎస్వి కృష్ణ రెడ్డి గారు, కెమెరా మ్యాన్ శరత్ ముగ్గురూ కలిసి మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు తెలీకుండా వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వచ్చారు. అప్పట్లో సుచిత్ర నా మూవీస్ కి ఎక్కువగా వర్క్ చేసేది. నాకు సిస్టర్ లాంటిది. ఆ తర్వాత ఏం జరగలేదు. నేను కానీ సౌందర్య కానీ ఉత్సాహపడలేదు". అని చెప్పారు జెడి.చక్రవర్తి. అలాగే తనకు ఇష్టమైన వాళ్ళ మీద ఒక లైన్ కూడా చెప్పారు చక్రవర్తి. ఆర్జీవీ అంటే దేవుడు, ఉత్తేజ్ అంటే ఏంజెల్, ఖాసీం అంటే డెవిల్, సుబ్బరాజు అంటే జెంటిల్ మాన్ అంటూ ఆన్సర్స్ చెప్పారు. అలాగే అండర్ వరల్డ్ మాఫియా వాళ్లకు తాను బాగా తెలుసు అని కూడా చెప్పారు జెడి . గులాబీ, సత్య, మనీ మూవీస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ మళ్ళీ ఇన్నాళ్లకు "దయా" మూవీలో వచ్చింది అంటూ చెప్పారు చక్రవర్తి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.