English | Telugu

ముడ్డి కడిగే వయసులో మెలోడీ సాంగ్స్ అవసరమా...రాత్రి ఎందుకు పిలిచారు అన్న రష్మీ


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. ఇందులో రాంప్రసాద్ నులక మంచం మీద నిద్రపోవడం,  కలలో ఒక సౌందర్య రాశి రావడం ఆ మంచం పక్కన కాలి పట్టీ వదిలేసి వెళ్లడం దాన్ని రాంప్రసాద్ తీసుకుని ఆ అమ్మాయి గురించి తెలుసుకోలేని అనుకోవడం అంతా ఫన్నీగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి రాంప్రసాద్ తన ఫ్రెండ్స్ ని పిలుస్తాడు. అలా రష్మీ, ఇంద్రజ అంతా వస్తారు. "రాత్రికి ఎందుకు పిలిచారు" అని రష్మీ డౌట్ తో అడిగేసరికి "నైట్ టైం జరిపిస్తామని తెలీదా మీకు" అన్నాడు రాంప్రసాద్ గుసగుసగా. వెంటనే ఇంద్రజ గట్టిగా అరిచేసరికి "అదే ఊళ్ళో జాతర ఒకటి చేయాలి అందుకే పిలిపించాం" అన్నాడు రాంప్రసాద్. తర్వాత రాకెట్ రాఘవ మంచి రొమాంటిక్ సాంగ్ తో డాన్స్ ఇరగదీసేసరికి వాళ్ళ అబ్బాయి వచ్చి "ముసలోడికి  దసరా పండగ అంటే ఇదేనేమో..ముడ్డి కడిగే వయసులో మెలోడీ సాంగ్ లు కావాలా నీకు .చేయాలంటే గుమ్మాడి గుమ్మాడి అనే సాంగ్ చేయాలి కానీ గున్నా గున్నా మామిడి అంటావు రష్మీలా ఊగుతావు " అని చెప్పిన డైలాగ్ కి అంతా నవ్వేశారు.

తర్వాత నూకరాజు మంత్రగాడి వేషంలో అమ్రిష్ పురిలా వచ్చాడు. రాంప్రసాద్ నూకరాజు దగ్గరకు వచ్చి పట్టీ చూపించి "ఈ అమ్మాయి మిస్ అయ్యింది ఎక్కడ ఉంది" అని అడిగాడు..."ఆ పిల్ల ఎక్కడ ఉందో చెప్తాను" అంటూ  వెంటనే ఏదో పొడి గాల్లోకి విసిరాడు నూకరాజు .."కనపడిందా" అని మరో కమెడియన్ అడిగేసరికి "లేదు పొడి కళ్ళల్లో పడింది" అని కామెడీ పంచ్ వేసాడు నూకరాజు. మరో కమెడియన్ వచ్చి "నా పెళ్ళాం కనిపించడం లేదు..ఎప్పుడొస్తుంది" అని మంత్రగాడి గెటప్ లో ఉన్న నూకరాజుని అడిగేసరికి "రెండు రోజుల తర్వాత వస్తుంది..నేను అప్పుడే పంపిస్తాను" అని నవ్వుతూ చెప్పేసరికి అందరూ షాకయ్యారు. తర్వాత కొన్ని కామెడీ టాస్క్స్ ఇచ్చి వాళ్లందరితో గేమ్స్ ఆడించింది రష్మీ.