English | Telugu

డబ్బులు తీసుకుంటున్నావుగా పంచులు పేలడం లేదు...హరి మీద అవినాష్ ఫైర్


"ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్" లో ఈ వీక్ సీనియర్ అండ్ జూనియర్ బుల్లితెర నటీనటులు వచ్చి సందడి చేసారు. అవినాష్, ఎక్స్ప్రెస్ హరి, పటాస్ ఫైమా ముగ్గురు పెద్ద సింగర్స్ లా బిల్డప్ ఇచ్చారు. కానీ ఆడియన్స్ ఎంటర్టైన్ కావడం లేదని పంచులు పేలడం లేదని హరి మీద ఫైర్ అయ్యాడు అవినాష్. "ఏం ఫైమాకి మంచి మంచి డైలాగ్స్ రాస్తున్నావ్...నాకేం రాస్తున్నావ్ నువ్వు..డబ్బులు తీసుకుంటున్నావ్ కదా..ఒక్క పంచ్ పేలడం లేదు.." అనేసరికి శ్రీముఖి కూడా "మీ వల్ల ఏం కావడం లేదు ఎలాగైనా నా చెల్లి ఫైమా చాలా టాలెంటెడ్ అనేసరికి "అవినాష్ కి వయసైపోయింది" అని మళ్ళీ డైలాగ్ వేసాడు హరి. ఇలాంటి డైలాగ్స్ మధ్యన టు టీమ్స్ ని పిలిచేసింది శ్రీముఖి. జూనియర్ యాక్టర్స్ ని ఇస్మార్ట్ పోరీల పేరుతో అలాగే సీనియర్ యాక్టర్ ని తీన్మార్ లేడీస్ పేరుతో ఇన్వైట్ చేశారు. "యాష్మి నాలా కర్లీ హెయిర్ ఎందుకు వేసుకొచ్చావ్ అనేసరికి నేను మీ పెద్ద ఫ్యాన్" అని చెప్పింది.

సరే ఇంతకు అతని పేరు చెప్పు అని యాష్మిని శ్రీముఖి అడిగేసరికి "అవినాష్" అని చెప్పింది. ఎక్సప్రెస్ హరి పేరేంటో చెప్పమనడంతో యాష్మి తప్పు చెప్పింది. ఈ ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ లో సీనియర్ యాక్టర్స్ విన్ అయ్యారు. ఇక సెకండ్ రౌండ్ "పద చూసుకుందాం"లో టు టీమ్స్ కి కలిపి ఒక టాస్క్ ఇచ్చింది. పసుపు కొమ్ముల్ని రోటిలో దంచి దాన్ని జల్లించి ఎన్ని గ్రాముల పసుపు తీస్తారో వాళ్ళే విన్నర్స్ అని అనౌన్స్ చేసింది. చివరికి సీనియర్ యాక్టర్స్ ఈ టాస్క్ గెలిచారు. అలాగే ఈ రెండు టీమ్స్ మధ్య ప్రాంతాల చార్ట్ ని పెట్టి ఏ ప్లేస్ పేరు చెబితే ఆ ప్లేస్ లోకి మూవ్ అయ్యేలా ఒక గేమ్ కూడా ఆడించింది. ఇందులో జూనియర్ యాక్టర్స్ విన్ అయ్యారు. ఈ టాస్క్ తర్వాత తర్వాత నీప డాన్స్ ఈ షోకి హైలైట్ గా నిలిచింది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.