English | Telugu

గృహలక్ష్మి సీరియల్ 1000 ఎపిసోడ్ సెలబ్రేషన్స్!

గృహలక్ష్మి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతూ.. 1000 ఎపిసోడ్ మైలురాయిని చేరుకుంది. ప్రతి ఇంట్లో మహిళ ఎదుర్కునే ఇబ్బందులు, చేసే త్యాగాలను వివరిస్తూ మంచి కథతో సాగుతున్న ఈ సీరియల్.. ఇప్పుడు టీఆర్పీలో టాప్ రేటింగ్ లో ఉంది.

గృహలక్ష్మి సీరియల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అనడంలో ఆశ్చర్యం లేదు. తులసి పాత్రలో కస్తూరి నటిస్తుంది. కస్తూరి శంకర్.. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయకులతో కలిసి సినిమాలు చేసింది. అయితే సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో..2014లో టాప్‌లెస్ ఫోటోషూట్ ద్వారా కస్తూరి శంకర్ వార్తల్లో వ్యక్తిగా మారింది. "జేడ్ బెల్ పుస్తకం ది బాడీస్ ఆఫ్ మదర్స్: ఎ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్‌" లో భాగంగా ఆమె అర్థనగ్నంగా ఫోటోలకి ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు వివాదాస్పదంగా మారాయి. ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని 'గృహలక్ష్మి' సీరియల్ తో స్టార్ట్ చేసింది కస్తూరి.

గృహలక్ష్మి సీరియల్ లో తులసి(కస్తూరి) భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను పట్టించుకోకుండా ఉంటాడు. దాంతో తులసి ఇంటి బాధ్యతలు తీసుకొని ఇంటిని క్రమపద్ధతిలో ఉంచుతుంది. అటు భర్తని ఇబ్బంది పెట్టకుండా, ఇటు అత్త మామలను తల్లితండ్రులుగా చూస్తూ తులసి పాత్రలో కస్తూరి ఒదిగిపోయింది. తులసి ఎవరి పై ఆధారపడకుండా తనే సొంతంగా వర్క్ చేస్తూ పిల్లలని చదివించింది. పిల్లలకి పెళ్లి చేసి ఒకానొక సందర్బంలో తనని కాదని వెళ్ళిపోయిన తన భర్త నందుకి కూడా ఆర్థిక సాయం చెయ్యడానికి కూడా వెనుకంజ వెయ్యలేదు. అలాంటి ధైర్యం ఉన్న స్త్రీ పాత్రలో కస్తూరి మెప్పిస్తుంది. గృహలక్ష్మి సీరియల్ రోజు రోజుకి ట్విస్ట్ లతో కథ ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ 1000 వ ఎపిసోడ్ సందర్బంగా సీరియల్ యూనిట్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని కస్తూరి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.