English | Telugu

ఫ్యామిలి నంబర్ 1 గేమ్ షోకి తీన్మార్ యాంకర్ రాధ అలియాస్ ధరణి ప్రియా

జీ తెలుగులో త్వరలో ఫ్యామిలి నంబర్ 1 పేరుతో ఒక ఫామిలీ గేమ్ షోని త్వరలో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో షో గురించి ఆడియన్స్ లో ఒక ఇంటరెస్ట్ ని క్రియేట్ చేయడం కోసం ఒక్కో ప్రోమోని రిలీజ్ చేస్తూ వస్తోంది..మొన్న కమెడియన్ ధన్ రాజ్ అండ్ ఫామిలీతో ప్రోమో రిలీజ్ చేస్తే ఈరోజు యాంకర్ ధరణి ప్రియాతో ఉన్న ప్రోమోని రిలీజ్ చేసింది. ధరణి ప్రియా ఒడిలో ఒక పాపతో అలా నిద్రపోతూ ఉంటే ఆమె భర్త వచ్చి ఆ పాపను, తనను చూసుకున్నట్టుగా ఈ ప్రోమోని చేశారు. "జీవిత లక్ష్యం సాధించాలంటే ఎంతో కష్టపడాలి..అది ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే సాధ్యమవుతుంది" అనే మాటలతో ఈ ప్రోమో చూపించారు.

ఇక ఈ ప్రోమోలో కనిపించిన ధరణి ప్రియా గురించి తెలుసుకోవాలి అంటే ఒక ఛానల్ లో తీన్మార్ న్యూస్ చదివే సావిత్రి అలియాస్ శివజ్యోతి వెళ్ళిపోయాక యాంకర్ రాధ వచ్చింది. ఆమె అసలు పేరు ధరణి ప్రియా. ఐతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె రాధగానే తెలుసు. తెలంగాణ యాసలో తీన్మార్ వార్తలు చదువుతూ అందరిని ఆకట్టుకుంది రాధ . ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం 2015లో మోహిత్‌ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. యాంకరింగ్ మీద ఇంట్రస్ట్‌తో జెమిని మ్యూజిక్‌లో యాంకర్‌గా కెరియర్ స్టార్ట్ చేసింది రాధ అలియాస్ ధరణి ప్రియా. రంగస్థలం, డాన్స్ షోలో కంటెస్టెంట్‌ గా కూడా చేసింది యాంకర్ రాధ. అంతేకాదు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ నటించింది కూడా. అలాగే దువ్వాడ జగన్నాథం, బాలక్రిష్ణుడు, నేలటిక్కెట్ వంటి మూవీస్ లో కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్ డేట్స్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఈమె కూడా ఈ ఫ్యామిలీ నంబర్ వన్ గేమ్ షోలో కనిపించబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.