English | Telugu
తృటిలో తప్పించుకున్న కావ్య.. అడ్డంగా దొరికిపోయిన స్వప్న!
Updated : Jul 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -152 లో.. ఇంట్లో కబోడ్ లో కనిపించిన కావ్య వేసిన డిజైన్స్ చూసిన రాజ్ షాక్ అవుతాడు. తన లాప్టాప్ లో ఉన్నవి, కావ్య వేసినవి సేమ్ ఉండడంతో.. శృతికి రాజ్ ఫోన్ చేస్తాడు. ఫ్రీ లాన్సర్ గా వర్క్ చేస్తున్న అమ్మాయి పేరేంటని రాజ్ అడగగానే.. శృతి టెన్షన్ పడుతూ కావ్య పేరు చెప్పకుండా శిరీష అని చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కి శృతి అబద్ధం చెప్పిందని అర్ధం అవుతుంది. కావాలనే శృతి చేత కావ్య అబద్ధం చెప్పిస్తుందని రాజ్ అనుకొని ఎలాగైనా నిజమేంటో తెలుసుకోవాలనుకుంటాడు.
మరొకవైపు కనకం ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తుంటారు. అన్నపూర్ణ తనకు సపరేట్ ప్లేట్ తెచ్చుకోవడం చూసిన కనకం.. ఏంటని అడుగుతుంది. నాకు డాక్టర్ టీబీ లక్షణాలు ఉన్నాయని చెప్పాడు కదా అది అంటూ వ్యాధి కదా అందుకే నాకు సపరేట్ ప్లేట్ అని అన్నపూర్ణ అనగానే.. కనకం కోప్పడుతుంది. అవన్నీ ఒక్కప్పుడు ఇప్పుడు కాదని అప్పు తను తినే భోజనాన్ని అన్నపూర్ణకి తినిపిస్తుంది. అప్పు ఆలా ప్రేమగా భోజనం తినిపిస్తుంటే అన్నపూర్ణ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు రాజ్ పడుకున్నాక కావ్య బాల్కనీ లోకి వెళ్లి డిజైన్స్ వేస్తుంది. రాజ్ నిద్ర నుండి లేస్తాడు. కావ్య డిజైన్స్ వేస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొని చూస్తాడు. అందులో డిజైన్స్ ఏం ఉండవు. ఏం చేస్తున్నావని కావ్యని రాజ్ అడుగుతాడు. నా ముందే ఎవరో అమ్మాయి డిజైన్స్ బాగా వేశారని పొగిడారు కదా నేను అలా డిజైన్స్ ట్రై చేస్తున్నా అని పేపర్ పై ఒక డిజైన్ వేస్తుంది. అది చూసిన రాజ్ దీన్ని ఎవరన్నా డిజైన్ అంటారా అని అంటాడు. కావాలని నా ముందు దొరికిపోతా అని ఇలా వేసావ్ కదా ఎలాగైనా ఆ డిజైన్స్ వేసేది నువ్వే అని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా అని రాజ్ తన మనసులో అనుకుంటాడు.
మరొక వైపు స్వప్న బయట స్కిప్పింగ్ చేస్తుంటుంది. అది చూసిన కావ్య కోపంగా స్వప్న దగ్గరికి వస్తుంది. అప్పుడే బయట నుండి ఇందిరాదేవి, సీతరామయ్య వస్తు స్వప్నని చూసి కోప్పడతారు. ప్రెగ్నెంట్ ఎవరైనా ఇలా చేస్తారా అని కోపంగా అరిచేసరికి ఇంట్లో అందరూ బయటకు వస్తారు. నీకు తెలియకుంటే ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోవాలని స్వప్నతో ధాన్యలక్ష్మి అంటుంది. అందరూ కోప్పడుతుంటే.. చాలు ఇక ఇంకోసారి ఇలా చెయ్యనని స్వప్న అంటుంది. ఈ స్వప్న చేస్తున్న పనులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని రుద్రాణి అనగానే.. ఏమని చెప్తావ్.. చెప్పి వాళ్ళని బాధపెట్టడం ఎందుకు. తనని జాగ్రత్తగా అత్తింటి వారే చూసుకోవాలని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.