English | Telugu

పేద విద్యార్థుల కల కోసం రిషి ఆ ప్రపోజల్ ని ఒప్పుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -819లో.. మన కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలను రిషి, వసుధార ఇద్దరు చూసుకోవాలని మహేంద్ర, జగతి ఒక ప్రపోజల్ పెట్టారని విశ్వనాథ్ చెప్తాడు. దానికి మీరేమంటారని వసుధార, రిషి ఇద్దరిని అడుగుతాడు విశ్వనాథ్.

ఆ ప్రపోజల్ విన్న రిషి, వసుధార ఆశ్చర్యంగా చూస్తారు. నాకు ఒకే సర్ కానీ రిషి సర్ అభిప్రాయం కూడా కావాలి కదా అని వసుధార అనగానే.. నువ్వు ఏమంటావని రిషిని విశ్వనాథ్ అడుగుతాడు. వాళ్ళ కాలేజీ లెక్చరర్స్ ఉన్నారు కదా మన కాలేజీ వాళ్లే ఎందుకని రిషి అంటాడు. ఆ ప్రాజెక్ట్స్ చేసే అర్హతలు మీకు ఉన్నాయేమో అందుకే ఈ ప్రపోజల్ పెట్టారని విశ్వనాథ్ అంటాడు. నేను ఒకసారి ఆ ప్రపోజల్ తెచ్చిన వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటానని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార, రిషి, జగతి, మహేంద్ర అందరూ కలిసి మాట్లాడుకుంటారు. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చారు. ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా ఎలా ఉన్నాడో చూసి పోదామని వచ్చారా అని రిషి కోపంగా మాట్లాడతాడు. అది కాదు రిషి అని జగతి, మహేంద్ర చెప్పే ప్రయత్నం చేసినా రిషి వినిపించుకోడు. ఈ మోసగాడి దగ్గరికి ఎందుకు వచ్చారు. నేను మోసగాడినని అందరికి తెలిసేలా చేసి ఎందుకు వచ్చారంటూ రిషి ఆవేశపడుతాడు. రిషి నేను చేసింది తప్పు.. ఒప్పుకుంటున్నా నన్ను క్షమించు. నువ్వు లేక కాలేజీ ఉనికి లేదు. మిషన్ ఎడ్యుకేషన్ ఆగిపోయింది. మా కోసం కాదు పేద విద్యార్థుల కోసం.. నీ కల కోసమైనా ఈ బాధ్యతలు మళ్ళీ చేపట్టమని రిషితో జగతి అంటుంది. ఏం నిర్ణయం తీసుకోవాలి అన్న నాకు టైమ్ కావాలని చెప్పేసి రిషి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రిషి సర్ ఇంకా పాత గాయం మర్చిపోలేదు. కానీ స్టూడెంట్స్ కోసం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు చెప్పడతాడని వసుధార అంటుంది. వసు అని జగతి ఏదో మాట్లాడుతుండగా.. నాకు మీకు మధ్య ఏ బంధం లేదు. నాకు నా బంధం మీ వల్ల దూరం అయింది. మీకు మీ బంధం దూరం అయిందా? మా బంధం కలిసినప్పుడు మీ బంధం కలుస్తుంది. అప్పుడు మన బంధం కలుస్తుందని జగతితో వసుధార చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక వెళతామని విశ్వనాథ్ తో మహేంద్ర చెప్తాడు. లోపలికి వచ్చి పద జగతి వెళదామని మహేంద్ర అంటాడు. "లేదు మహేంద్ర.. రిషి దగ్గరే కొన్ని రోజులు ఉండాలని ఉంది" అని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే .

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.