English | Telugu

చెయ్యి బానేఉంది కేక్ ఊగిపాయింది

పవన్ కళ్యాణ్ నటించిన "బ్రో" మూవీ త్వరలో రీలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ ప్రొమోషన్స్ లో భాగంగా ఈ మూవీలో నటించిన సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ నెక్స్ట్ వీక్ డ్రామా జూనియర్స్ సీజన్ 6 ఎపిసోడ్ కి గెస్టులుగా వచ్చేసారు. సాయిధరమ్ తేజ్ ని చూసేసరికి "అచ్చం చిరు అన్నను చూసినట్టే ఉంటుంది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసారు జడ్జ్ బాబుమోహన్. వెంటనే మరో జడ్జ్ శ్రీదేవి "హలో బ్రో" అనేసరికి "మీరు బ్రో అంటే కష్టంగా ఉందండి" అన్నాడు సాయి ధరమ్ తేజ్. "ఇప్పుడే అందరూ బ్రో అన్నప్పుడు థ్యాంక్యూ అన్నారు" అని ప్రదీప్ కౌంటర్ వేసేసరికి "ఆడియన్స్ పర్లేదు కానీ శ్రీదేవి గారు బ్రో అంటే మాత్రం బాలేదు" అన్న లెక్కలో ఒక డైలాగ్ వేశారు.

వెంటనే శ్రీదేవి స్టేజి మీద నుంచి వచ్చి తేజ్ తో కలిసి డాన్స్ చేశారు. "నా కళ్లన్నీ ఆమె దగ్గర స్టక్ ఐపోయాయి నేనేంచేయను" అని తేజ్ అనేసరికి "పర్లేదు నేను హ్యాండిల్ చేస్తాను" అన్నాడు ప్రదీప్. "ఎవరిని హ్యాండిల్ చేస్తావ్" అన్నారు తేజ్ కామెడీ. "పెళ్లి కాలేదు కదా అన్ని హ్యాండిల్ చేస్తాడు" అని కౌంటర్ వేశారు బాబూమోహన్. "అవును నేను ఎప్పటినుంచో చూస్తున్న ప్రదీప్ " అని తేజ్ అన్నారు సరదగా. తర్వాత ప్రదీప్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు.."ఇంట్లో ఓకే కానీ ఆన్ లొకేషన్ లో చాలా భయమేస్తుంది కదా" అని తేజ్ ని అడిగాడు "ఫస్ట్ డే షూట్ లో నేను ఆయనకు కేక్ తినిపించాలి ..నేను కేక్ పెట్టాను డైరెక్టర్ కట్ చెప్పారు, మళ్ళీ చేశా మళ్ళీ కట్ చెప్పారు..చెయ్యి బానే ఉంది..కానీ కేక్ ఊగుతోంది" అని తేజ్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఈ మూవీ జూలై 28 న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్‌ను 21న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది. థమన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరికొత్తగా కనిపించబోతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.