English | Telugu

పికె నేషనల్ లీడర్ అన్న సముద్రఖని..యూనివర్సల్ బ్రో ఇపోయానన్న సాయిధరమ్ తేజ్


త్వరలో "బ్రో" మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సుమ డైరెక్టర్ సముద్రఖని, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మని ఇంటర్వ్యూ చేసింది.  "సముద్రఖని గారితో వర్క్ చేయడం అంటే చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది..ఆర్టిస్ట్స్ పక్కనే కూర్చుని డైలాగ్స్ చెప్పిస్తారు...ఈ మూవీతో నేను యూనివర్సల్ బ్రో ఐపోయాను" అని చెప్పారు సాయి ధరమ్ తేజ్..తర్వాత వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగింది సుమ "రీమేక్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు" అని  అడిగేసరికి "ఇది రీమేక్ కాదు..టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. రాజ్ కుమార్ హిరానీ గారి మూవీస్ లో ఫస్ట్ లో అంతా కామెడీగా లాస్ట్ లో ఎలా ఐతే ఎమోషనల్ గా ఉంటుందో సముద్రఖని గారి మూవీస్ కూడా అలాగే ఉంటాయి" అని చెప్పారు సాయి ధరమ్ తేజ్..."పవన్ కళ్యాణ్ గారితో చేయడం ఎలా అనిపించింది" అని తేజ్ ని అడిగింది సుమ. " ఒక పేజీ డైలాగ్ ఇచ్చి నన్ను ప్రిపేర్ అవమన్నారు.

నేను రెడీ ఐపోయాను. తర్వాత సముద్రఖని గారు వచ్చి మొత్తం వద్దు లాస్ట్ త్రి లైన్స్ డైలాగ్ చాలు అన్నారు. సరే అని లాస్ట్ మూడు లైన్స్ మీద ఫోకస్ పెట్టా. మిగతాది మొత్తం మర్చిపోయా. తర్వాత కళ్యాణ్ మావయ్య సెట్ కి వచ్చి తేజ్ మొత్తం డైలాగ్ చెప్పు అన్నారు నేను షాక్ ...వెంటనే సముద్రఖని గారి వైపు చూసా...నా మైండ్ లో ఎం లేదు అని చెప్పా...మళ్ళీ మావయ్యను టైం అడిగి మొత్తం ప్రిపేర్ అయ్యా చివరికి లాస్ట్ త్రి లైన్స్ చాలు అని చెప్పి నన్ను చాలా ఆట పట్టించారు " అన్నారు తేజ్. "సర్ ఎలా అంటే ఫుల్ సీన్ సింగల్ షాట్ లో చేయాలని చెప్తారు. ఫోర్ పేజెస్ సీన్ ఐనా కూడా సింగల్ షాట్ ఐపోవాలంటారు. తర్వాత మీరు కట్ చేసుకోండి అంటారు. అలా సింగల్ షాట్ లో సీన్ ఐపోవాలి అనే చెప్పే ఆర్టిస్ట్ ని చూడడం ఫస్ట్ టైం అని చెప్పారు సముద్రఖని..అలాగే చాలా కొత్త సబ్జెక్టుతో సాయి ధరమ్ తేజ్ తో మరో మూవీని ప్లాన్ చేస్తున్నాను అని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చి ఆయన  ఎనర్జీ లెవెల్ వేరు. ఆయన విజన్ చాలా డిఫరెంట్..21 డేస్ సర్ తో వర్క్ చేసాను. ఈ సొసైటీ గురించి సర్ మైండ్ లో ఉన్నది తెలుసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది. సర్ స్టేట్ లీడర్ కాదు..ఆయన నేషనల్ లీడర్. ఆయన మైండ్ లో ఉన్న విజన్ ని అప్లై చేస్తే మనమంతా ఆశ్చర్యపోతాం " అని చెప్పారు సముద్రఖని. ఇలా సుమ బ్రో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళ ముగ్గురితో ఇంటర్వ్యూ చేసి ఎన్నో విషయాలను ఆడియన్స్ కి తెలిసేలా చేసింది.