English | Telugu

జర్మనీలో ఫ్రెండ్స్ తో గడ్డి తింటున్న నేహా చౌదరి!


నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితే. స్పోర్ట్స్ రిప్సెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయిన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు.

నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది.

పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్ళిన నేహా చౌదరి.. అక్కడ సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళింది. అదంతా కలిపి ఒక వ్లాగ్ అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, అవుటింగ్ అంటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి. అయితే ఈ వ్లాగ్స్ ని తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది నేహా చౌదరి. ఇప్పుడు తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక హోటల్ కి వెళ్ళింది నేహా చౌదరి. అక్కడ వాళ్ళు తినే ఫుడ్ లో గడ్డి వచ్చిందంటూ చెప్పింది. మేం ఇక్కడికి వచ్చాకే ఇలాంటివన్నీ చూస్తున్నాం.. పాపం మా ఫ్రెండ్ అంటూ నవ్వేసింది నేహా చౌదరి. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుతున్న నేహా చౌదరి.‌. రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.