English | Telugu

చరణ్ అర్జున్ కి  ఈ సినిమాతో  బ్రేక్ దొరుకుతుందా!

కొంతమంది లిరిక్ రైటర్స్ ఎన్ని హిట్ సాంగ్స్ రాసిన పెద్దగా పేరు రాదు. అయితే ఎప్పుడైతే జనాల గుండెల్లో నిలిచిపోతూ.. సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటుందో అప్పుడే  ఆ పాట రాసిందెవరని, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని తెలుసుకోవాలనే ఆలోచన వస్తుంది. అలాంటిదే ఈ మధ్య కాలంలో ఒక పాట ఫుల్ వైరల్ అయింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో సీఎమ్ రేవంత్ రెడ్డి మీద వచ్చిన పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాటతోనే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం జనాల్లోకి మరింతగా వెళ్లిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ పాటను చరణ్ అర్జున్ కంపోజ్ చేశాడు. 

Krishna Mukunda Murari : వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలి.. లేదంటే ప్రమాదమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -451 లో.. కడుపునొప్పితో ఉన్న కృష్ణను అందరు కలిసి ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. అయితే కృష్ణకు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ పరిమిళ.. మురారీని తన క్యాబిన్‌కి రమ్మంటుంది. మురారి వెనుకే మీరా కూడా వినడానికి వెళ్తుంది. అదేసమయంలో మధుకి రేవతి కాల్ చేసి.. ఏడుస్తుంది. దానికి ఎలా ఉందిరా? కృష్ణకి నొప్పి తగ్గిందా? డాక్టర్ ఏమన్నారంటు మధుని రేవతి అడుగుతుంది. ఏం కాదు పెద్దమ్మా.. డాక్టర్ చూస్తున్నారు. అంతా బాగైపోతుంది.. మీరు బాధపడి.. పెద్దపెద్దమ్మను హడావిడి చేయొద్దని మధు అంటాడు‌. దాంతో రేవతి ఏడవడం ఆపేసి ఫోన్ పెట్టేస్తుంది.

గడ్డాలు, మీసాలు తీసేసి శ్రీముఖిని మోసం చేసిన బ్రిట్టో

నీతోనే డాన్స్ 2 .0 ఈ వారం శనివారం ఎపిసోడ్ భలే క్యూట్ గా సాగింది. ఈ వారం థీమ్ ఏంటంటే రెట్రో స్పెషల్ ... ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట. కంటెస్టెంట్స్ అంతా కూడా ఓల్డ్ కాస్ట్యూమ్స్ వేసుకొచ్చి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ని ఇరగదీసేసారు. ఇక హోస్ట్ శ్రీముఖి ఐతే మహానటి గెటప్ లో అద్దిరిపోయింది. ఐతే ఒక విషయంలో బుంగమూతి పెట్టుకుని కూర్చుంది. ఈ షోకి అందరూ జంటలుగా, జోడీలుగా ఎవరికీ నచ్చిన వాళ్ళను వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఈరోజు తాను కూడా తన రాజాను తెచ్చుకున్నట్టు చెప్పింది. "నా కలల రాకుమారుడిని, నా రాజాని చూపించే టైం వచ్చేసింది..రా రాజా" అని స్టేజి మీదకు ఇన్వైట్ చేసింది.